గాజు గోడలతో కూడిన జంగిల్ బార్.. భూగర్భంలో స్విమింగ్ పూల్.. మూడు పర్వత శిఖరాల ఆకారంలో ఇంటి డిజైన్.. ఇవీ రెండో ఇంటి కోసం పలువురు కావాలనుకుంటున్న డిజైన్లు. ఢిల్లీలో ఇటీవల జరిగిన ఇండియా డిజైన్2025 కార్యక్రమంలో పలువురు ఆర్కిటెక్టులు తమ అనుభవానలు పంచుకున్నారు. క్లయింట్ల విచిత్రమైన కోరికలు, ఆకాంక్షలు.. సృజనాత్మకత సరిహద్దులను అధిగమించే విషయంలో తమకు సవాల్ విసిరాయని పేర్కొన్నారు. గోవా, అలీభాగ్ వంటి సెకండ్ హోమ్ డెస్టినేషన్లలో హై ఎండ్ విల్లా ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
పైగా కొనుగోలుదారుల నుంచి కొన్ని విచిత్రమైన డిజైన్ అభ్యర్థనలు వస్తున్నాయని పేర్కొన్నారు. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ప్రాపర్టీ మూడు పర్వత శిఖరాల ఆకారంలో ఉండాలని సదరు క్లయింటు కోరుకున్నట్టు ఓ ఆర్కిటెక్ట్ వెల్లడించారు. అలాగే కొండ పై భాగంలో ఓ ట్రీ హౌస్ నిర్మించాలనే అభ్యర్థన వచ్చినట్టు మరో ఆర్కిటెక్ట్ తెలిపారు. అయితే, ఆ కొండ పై భాగానికి నిర్మాణ సామగ్రి తరలించేందుకు సరైన రోడ్లు లేకపోవడంతో ఓ దశలో హెలికాప్టర్ వినియోగించాలని కూడా భావించినట్టు ఆయన చెప్పారు.
గోవాలో ఒక క్లయింట్ అడవి మధ్యలో ఒక పెద్ద బార్‌ను నిర్మించాలని పట్టుబట్టినట్టు మరో ఆర్కిటెక్టు వెల్లడించారు. మొత్తానికి రకరకాల ఆకాంక్షలు, డిజైన్లతో భారతదేశ రెండో ఇంటి మార్కెట్ అద్భుతమైన పరివర్తనకు లోనవుతోందని.. అతి సంపన్న గృహ యజమానులు గేట్ వే ఆఫ్ రిట్రీట్ భావనను పునర్నిర్మిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశంలో సెకండ్ హోమ్స్ ఇకపై కేవలం సాధారణ వారాంతపు విహారయాత్రలు మాత్రమే కాదు.. దట్టమైన అడవులలో, కఠినమైన కొండలపై లేదా ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ పైన తేలుతూ ఉండే బోల్డ్ ఆర్కిటెక్చరల్ కళాఖండాలుగా మారుతున్నాయి.
గోవాలో గాజు గోడల రహస్య ఇంటి నుంచి రాజస్థాన్ లో భూగర్భ ఎడారి భవనం వరకు ఈ విచిత్రమైన సెకండ్ హోమ్స్ సృజనాత్మకత పరిమితులను పెంచుతున్నాయి. అటు అద్భుతమైన సౌందర్యాన్ని అత్యాధునిక సాంకేతికతను కలుపుతున్నాయి. సెకండ్ హోమ్ మార్కెట్లో గోవా, అలీబాగ్ వంటి గమ్యస్థానాలు డిమాండ్ లో పెరుగుదలను చూస్తున్నాయి. అక్కడ లగ్జరీ విల్లా ప్రాపర్టీలు వేగంగా అమ్ముడవుతున్నాయి. మహారాష్ట్రలో లోనావాలా రెండవ గృహాలకు ప్రధాన స్థానంగా మారింది. విల్లాలు, ఫామ్‌హౌస్‌లు లేదా బంగ్లాల్లో పెట్టుబడి పెట్టాలనుకునే కొనుగోలుదారులను ఇది ఆకర్షిస్తోంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి బాలీవుడ్ తారలు పన్వెల్, అలీబాగ్, గోవా వంటి ప్రసిద్ధ గమ్యస్థానాలలో రెండవ గృహాలలో పెట్టుబడి పెట్టిన అనేక మంది ప్రముఖులలో ఉన్నారు.
This website uses cookies.