ఆకాశహర్మ్యాలు.. హైదరాబాద్‌కు సరికొత్త వన్నె తెస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నగరంలో జీవించాలని కోరుకునే వారికి ఇవి చక్కగా నప్పుతున్నాయి. ఒక్కో ఆకాశహర్మ్యానిది ఒక్కో ప్రత్యేకత. వాటి గురించి తెలుసుకుంటే, ఎప్పుడెప్పుడు.. అందులోకి వెళ్లి నివసించాలా అనే ఆత్రుత పెరగడం ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే, నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు.. విదేశీ స్థాయికి ఏమాత్రం తీసిపోని విధంగా.. భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల్ని నిర్మిస్తున్నాయి. మరి, ఏయే సంస్థలు ఎలాంటి కొత్త పోకడల్ని పరిచయం చేస్తున్నాయో తెలుసుకుందామా..
హైద్రాబాద్‌లో ఊబర్ లగ్జరీ లివింగ్ లైఫ్ స్టైల్‌ను కోరుకునే వారి కోసం రూపుదిద్దుకుంటున్న అత్యుత్తమ ప్రాజెక్టే.. వంశీరామ్ మన్‌హట్టన్. సెవెన్ స్టార్ లగ్జరీ కూడా చిన్నబోయేంత అద్భుతంగా.. కళ్లు చెదిరేలా రెండు లక్షల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న క్లబ్‌హౌస్‌లో ప్రీమియం అమెనిటీస్ కల్పిస్తున్నారు. పొప్పాల్‌గూడ రాజపుష్ప ప్రొవిన్షియా ప్రీమియం లగ్జరీ ప్రాజెక్ట్‌లో ఎంట్రన్స్ దగ్గర్నుంచే అడుగడుగునా ప్రత్యేకత కనిపిస్తుంటుంది. వర్టికల్ హ్యాంగింగ్ రింగ్స్.. వాటర్ స్కేప్స్‌తో గ్రాండ్ వెల్కమ్ చెబుతాయ్.
55 అంతస్థుల పౌలోమీ పలాజోలో.. ప్రతీ అంగుళం గ్రాండియర్ అండ్ లగ్జరీ అనే చెప్పాలి. లాబీ ఫైవ్ ఫ్లోర్స్‌లో ఉంటుంది. ఇందులో ట్రెండింగ్ ఫీచర్ ఏమిటంటే.. 52 అంతస్థుల ఎత్తులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్విమ్మింగ్‌పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్కై వ్యూస్ మధ్యలో డైవర్శిటీకి సిసలైన డెఫనిషన్‌లా ఉండే హైద్రాబాద్ బ్యూటీని అంత ఎత్తులో స్విమ్ చేస్తూ మరింత ఎంజాయ్ చేయొచ్చు. ఇక పలాజ్జో ప్రాజెక్ట్‌లో మరో స్పెషాల్టీ డబుల్ హైట్ బాల్కనీస్.
ఎల్‌బీనగర్‌లోని వాసవి ఆనంద నిలయంలో.. గోల్ఫ్ కార్ట్ రూట్ అండ్ ఎమర్జెన్సీ వెహికల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పారే నీటి సరస్సులు వాటిలో బాతులు.. చేపలు అలా ఈత కొడుతూ వెళ్లే దృశ్యాన్ని చూస్తే ఎంత హాయిగా ఉంటుందో కదా..! కానీ అపార్ట్‌మెంట్స్‌లో ఇలాంటి ఉల్లాసకరమైన దృశ్యాలు ఊహించగలరా..! ఆనంద నిలయంలో ఈ అద్భుతాన్ని సృష్టించింది వాసవీ గ్రూప్. ల్యాండ్‌స్కేప్ డిజైన్‌లో లేక్‌ను సైతం డిజైన్ చేశారు. అంతేనా ఎల్బీ నగర్ మెట్రోతో స్కై వాక్ కనెక్టివిటీని సైతం రూపొందిస్తున్నారు. ఓ అపార్ట్‌మెంట్ వాక్ వేను పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్‌తో కనెక్ట్ చేయడం ఇదే ప్రప్రథమం.
ఇండియాలో అత్యంత ఎత్తయిన క్లబ్‌హౌజ్ హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో గల సాస్ క్రౌన్‌లో ఉందనే విషయం చాలామందికి తెలియదు. నానక్‌రామ్‌గూడలో 9 ఎకరాల్లో ఊబర్ లగ్జరీ ప్రాజెక్టు అయిన టీమ్ ఫోర్ ఆర్కాలో.. ప్రతీ ఫ్లాట్‌కి ప్రైవేట్ లాబీ ఏరియానే కాదు- ప్రతీ ఫ్లాట్‌కి ఎంట్రన్స్‌లో డెడికేటెడ్ గార్డెన్ ఏరియా.. సపరేట్‌గా వీఆర్‌వీ ఏరియాని డెవలప్ చేశారు. మినీ గోల్ఫ్ అండ్ మినీ సాకర్ లాన్ ఇందులో ప్రొవైడ్ చేశారు. హైదరాబాద్‌లోనే ఏ బిల్డర్ ఏర్పాటు చేయని విధంగా.. ఎక్స్‌క్లూజివ్ క్రికెట్ గ్రౌండ్‌ని ప్లాన్ చేశారు కొండాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ ఐకానియాలో.
అన్వితా ఇవానాలో 2 లక్షల చదరపు అడుగుల్లో క్లబ్ హౌజ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి గ్రౌండ్ లెవల్లో.. మరో దాంట్లో టెర్రస్ లెవల్‌లో అమెనిటీస్ కల్పిస్తున్నారు. ఇందులో అంతర్జాతీయ స్థాయి ఈత పోటీలను నిర్వహించేలా లాప్ పూల్‌ని డిజైన్ చేశారు. మియాపూర్‌లోని క్యాండియర్ ట్విన్స్‌లో వేస్ట్ మేనేజ్‌మెంట్.. ఎక్స్‌క్లూజివ్ గార్బెజ్ చ్యూట్స్ ఏర్పాటు చేశారు.
హైద్రాబాద్‌లో నియో క్లాసికల్ స్టైల్లో కన్‌స్ట్రక్ట్ అవుతోన్న మొట్ట మొదటి ప్రాజెక్ట్ వాసవి స్కైలా. గ్రీక్ అండ్ రొమన్ ఆర్కిటెక్చర్ మిక్స్ అయి ఉండే వాసవీ స్కైలాని లగ్జరీ ప్రపంచానికి కొత్త అర్థం చెప్పేలా నిర్మిస్తున్నారు. విల్లామెంట్ కాన్సెప్ట్‌తో కన్‌స్ట్రక్ట్ అవుతోన్న ఈ మోస్ట్ లగ్జురీయస్ గేటెడ్ కమ్యూనిటీ పేరుకు తగ్గట్టే ఆకాశాన్ని అందుకునేలా ఉంటుంది. పనోరమా వ్యూస్, ప్రైవేట్ గార్డెన్స్ వాసవీ స్కైలా సొంతం.