- కొనుగోలు చేసిన సన్ ఫార్మా సీఎండీ భార్య విభా షాంఘ్వీ
సన్ ఫార్మా సీఎండీ దిలీప్ షాంఘ్వీ భార్య విభా షాంఘ్వీ ముంబైలోని వర్లీలో రూ.135 కోట్లతో రెండు అపార్ట్ మెంట్లను కొనుగోలు చేశారు. రెండింటి కార్పెట్ ఏరియా 12,916 అడుగులు. నమన్ గ్రూప్ చేపట్టిన నమన్ క్షానా అనే వర్లీ సీ ఫేస్ ప్రాజెక్టులో ఈ కొనుగోలు జరిగింది. 21వ అంతస్తులో 6,458 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ అపార్ట్ మెంట్ ను రూ.65 కోట్లకు కొనుగోలు చేయగా.. 29వ అంతస్తులో అదే పరిమాణంలో ఉన్న రెండో అపార్ట్ మెంట్ ను రూ.65 కోట్లకు కొనుగోలు చేశారు.
అంటే చదరపు అడుగు ధర రూ.లక్ష పలికినట్టయింది. రెండు అపార్ట్ మెంట్లకు కలిపి 8 కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. డిసెంబర్ మొదటి వారంలో బార్న్స్ లే ఫుట్ బాల్ క్లబ్ చైర్మన్ నీరవ్ పరేఖ్, ఆయన తల్లి కల్పనా పరేఖ్ రెండు అపార్ట్ మెంట్లను రూ.170 కోట్లకు కొనుగోలు చయడంతో ఈ భవనం వార్తల్లో నిలిచింది. ముంబైలోని వర్లీ లగ్జరీ ప్రాజెక్టులకు హాట్ స్పాట్. నమన్ క్సానా ప్రాజెక్టు వర్లీ సీ ఫేసింగ్ ప్రాజెక్టు. బాంద్రా-వర్లీ సీ లింక్ కు దగ్గరగా, ముంబై కోస్టల్ రోడ్, అరేబియా సముద్రానికి ఎదురుగా ఉంది.