ఓఆర్ఆర్.. ట్రిపుల్ ఆర్.. ఫోర్త్ సిటీ అంటూ హైద్రాబాద్ అభివృద్ధి వైపు ఫాస్ట్ ఫాస్ట్‌గా అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్‌కి కంటిన్యూగా అనేక నూతన ప్రాజెక్ట్‌లు ప్రతిపాదిస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇవన్నీ అనుకొన్న సమయానికి పూర్తైతే భవిష్యత్‌లో నగరంలో రియల్ బూమ్ మరింత పెరగడం ఖాయమనే అంచనాలు ఉన్నాయ్. అసలు హైద్రాబాద్ రియల్ ఎస్టేట్ విస్తరణ అంతా ఓఆర్‌ఆర్- ట్రిపుల్ ఆర్ మధ్యనే ఉంటుందని బలంగా నమ్ముతున్నారు డెవలపర్లు. అందుకు తగ్గట్టే వీటి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములకు డిమాండ్ కనిపిస్తోంది బయ్యర్ల నుంచి. మరి ఔటర్ రింగ్ రోడ్ రేడియన్స్‌లో ఏ ఏ ప్రాంతాల్లో ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయో మనమూ ఓ సారి చూద్దాం.
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్1- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్- చ.గ. రూ. 1.5 – 2 లక్షలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్2- కొల్లూరు- చ.గ. రూ. 60-80 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్3- ముత్తంగి (ముంబై హైవే)- చ.గ. రూ. 30-40 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్4- సుల్తాన్‌పూర్- చ.గ. రూ. 25-35 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్4ఏ- మల్లంపేట్- చ.గ. రూ. 35-40 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్5- దుండిగల్- చ.గ. రూ. 30-35 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్6- మేడ్చల్- చ.గ. రూ. 30-40 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్7- షామీర్‌పేట్- చ.గ. రూ. 28-35 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్8- కీసర- చ.గ. రూ. 20-25 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్9- ఘట్‌కేసర్ (వరంగల్ ఎగ్జిట్)- చ.గ. రూ. 20-30 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్10- తారామతిపేట్- చ.గ. రూ. 20-25 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్11- పెద్ద అంబర్‌పేట్(విజయవాడ హైవే)- చ.గ. రూ. 20-25 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్12- బొంగళూరు (నాగార్జున సాగర్)- చ.గ. రూ. 25-30 వేలు
ఓఆర్‌ఆర్ ఎగ్జిట్13- రావిర్యాల- చ.గ. రూ. 30-35 వేలు