Categories: LATEST UPDATES

ఈవీ చార్జింగ్ స్టేషన్లపై నిర్ణయం ఎప్పుడు?

  • ఇతర రాష్ట్రాల్లో తప్పనిసరి చేస్తున్న ప్రభుత్వాలు
  • మన రాష్ట్రంలో తుది నిర్ణ‌యం ఎప్పుడు?

సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కూడా కీలకంగా మారింది. ప్రస్తుతం కొన్ని పెద్ద సంస్థలు మాత్రమే తమ ప్రాజెక్టుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. చిన్న బిల్డర్లు వీటిని అసలు పట్టించుకోవడమే లేదు. ఇలాంటి పరిస్థితిని నిరోధించేందుకు ఇతర రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. తాము చేపట్టిన ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా ఈవీ చార్జింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 25 ఫ్లాట్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్టులో ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి అని పేర్కొంది. ప్రతి 25 ఫ్లాట్లకు ఓ స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఓ ప్రాజెక్టులో 100 ఫ్లాట్లు ఉంటే నాలుగు ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉండాల‌ని ఆదేశించింది.

ఈవీ ఛార్జింగ్ స్టేష‌న్ల విష‌యంలోనూ.. మన రాష్ట్రం ఇలాగే క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. శరవేగంగా జనాభా, వాహనాలు విస్తరిస్తున్న హైదరాబాద్ వంటి మహానగరంలో వీటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా వస్తున్న ప్రాజెక్టుల్లోనే కాకుండా పాత గేటెడ్ కమ్యూనిటీల్లోనూ వీటిని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న క్రమంలో సాధ్యమైనన్ని ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

This website uses cookies.