ఢిల్లీలోని కొందరు బడా డెవలపర్ల అత్యుత్సాహం.. భారీ లక్ష్యాలు.. వాటిని చేరుకునేందుకు అక్రమ రీతిలో అమ్మకాలు.. కొనుగోలుదారుల సొమ్ము దారి మళ్లింపు.. బయ్యర్ల ఆక్రందనలు.. ఆవేశాలు.. నిరసనలు.. తదితర అంశాల వల్ల యూపీఏ ప్రభుత్వం రెరా అథారిటీకి రూపకల్పన చేస్తే.. బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక వంటి రాష్ట్రాలు తప్ప రెరా చట్టాన్ని ఇతర రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోవట్లేదు.
తెలంగాణ ప్రభుత్వమూ 2018లో రెరాను అమల్లోకి తెచ్చినప్పటికీ.. ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. అయితే, హైదరాబాద్‌లో కొందరు అక్రమార్కులు యూడీఎస్ పథకాన్ని అమల్లోకి తెచ్చి విచ్చలవిడిగా ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు. దీని వల్ల ప్రస్తుతం కొనుగోలుదారుల్లో తాత్కాలిక సంతోషం కలుగును గాక. కాకపోతే, దీర్ఘకాలంలో బిల్డర్లు ఫ్లాట్లను అందించకపోతే అప్పుడుంటుంది అసలు మజా! ఈ పోకడ ఇతర రాష్ట్రాలకూ అతిత్వరలో వ్యాపించే అవకాశముందని పలువురు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఇలాంటి అక్రమ అమ్మకాల్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
This website uses cookies.