రోజురోజుకూ పెరిగిపోతున్న పనిభారాన్ని అధిగమించడానికి వీలుగా అదనపు సిబ్బందిని కేటాయించాలని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథార్టీ (రెరా) పేర్కొంది. పలువురు ఇళ్ల కొనుగోలుదారుల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించడానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 64 మందికి అదనంగా మరో 81 మందిని ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కె-రెరా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. ‘సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది.
దీనిపై మేం చేసిన వినతి ఇంకా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం సానుకూలంగి స్పందించి అదనపు సిబ్బందిని కేటాయిస్తే.. చాలా ఉపశమనం కలుగుతుంది’ అని ఓ అధికారి వెల్లడించారు. బిల్డర్లు అందచేసిన వివరాలను పరిశీలించేందుకే ఎక్కువ మంది సిబ్బంది అవసరమని వివరించారు. ప్రస్తుతం ప్రతి మూడు నెలలకూ ప్రమోటర్లు వివరాలను అప్ డేట్ చేస్తున్నారని.. వాటి పరిశీలన చాలా కీలకమని.. తాము పొందుపరిచిన వివరాల ఆధారంగానే కొనుగోలుదారులు నిర్ణయం తీసకుంటారని పేర్కొన్నారు.
అయితే, తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో ఈ పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. మరోవైపు రెరాలో ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కొత్త ధర్మాసనాలకూ సిబ్బంది అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం చైర్మన్, ఇద్దరు సభ్యులతో ఆరు ధర్మాసనాలు నడుస్తున్నాయని.. వీటికి జడ్జిమెంట్ రైటర్లు, స్టెనోలు, క్లర్కులు కావాలని పేర్కొన్నారు.
This website uses cookies.