Categories: LEGAL

ఫ్లాట్లు ఇస్తామని చెప్పి రూ.15 కోట్లకు టోకరా

  • కొనుగోలుదారులను ముంచిన సవ్యసాచి ఇన్ ప్రా

ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ సకాలంలో ఫ్లాట్లు అప్పగిస్తామని చెప్పి 75 మందికి పైగా కొనుగోలుదారులకు రూ.15 కోట్ల మేర టోకరా వేసింది. ఏడాదిలోగా ఫ్లాట్లు ఇస్తామన్ని సదరు కంపెనీ.. నాలుగేళ్లయనా కనీసం పునాది రాయి కూడా వేయకపోవడం గమనార్హం. గురుగ్రామ్ కు చెందిన సవ్యసాచి ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈ మోసానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఫరూక్ నగర్ లోని సెక్టార్ 3లో అమయా గ్రీన్స్ పేరుతో ఈ కంపెనీ ఓ ప్రాజెక్టు చేపట్టింది.

ఇందులోని ఫ్లాట్ల అమ్మకాల కోసం సంస్థ డైరెక్టర్ విజయ్ రాజన్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ను కూడా నియమించారు. ఈ క్రమంలో 78 మంది ఇందులో ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు. ఇందుకోసం చెల్లింపులన్నీ పూర్తి చేశారు. ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తిచేసి ఫ్లాట్లు అప్పగిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అయితే, ఇదంతా జరిగి నాలుగేళ్లు గడిచినా నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గుర్తించిన పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

This website uses cookies.