జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే నాటికి అన్ని లేఔట్లకు విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు అందేలా చూడాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. జగనన్న కాలనీల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులను సంప్రదించాలని.. అనంతరం ఇళ్లన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాలని సూచించారు. చట్టపరమైన అడ్డంకులు, ఇతర వివాదాల వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమవుతున్న చోట ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాని ఆదేశించారు. గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా, వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. కాగా, ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేశామని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ప్రభుత్వం రూ.64.35 వేల కోట్లను ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించామని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే తనిఖీ బృందాలు క్రమ తప్పకుండా లేఔట్లను సందర్శించి.. ప్రతిచోటా నాలుగు రకాలైన పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
This website uses cookies.