poulomi avante poulomi avante

కొత్త ఫ్లాట్‌ కొన్న జహీర్ ఖాన్

భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు ముంబైలో ఓ కొత్త అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. ఎల్ఫిన్ స్టోన్ రోడ్డులోని ఇండియా బుల్స్ స్కై భవనంలో లగ్జరీ అపార్ట్ మెంట్ ను రూ.11 కోట్లకు సొంతం చేసుకున్నారు. 2,158 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ అపార్ట్ మెంట్ మూడు కార్ పార్కింగ్ స్థలాలతో కలసి ఉంది. జహీర్ఖాన్, ఆయన భార్య సాగరిక ఘాట్గే, బావమరిది శివజీత్ ఘాట్గే కలిసి దీనిని కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించాయి. త రిజిస్ట్రేషన్ కోసం రూ.66 లక్షల స్టాంపు డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. ఫిబ్రవరి 10న ఈ లావాదేవీ నమోదైంది. కాగా, ఈ భవనంలో పున: విక్రయ ధర ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ.49,096గా ఉంది. ఇండియా బుల్స్ స్కైని ఈక్వినాక్స్ ఇండియా డెవలప్‌మెంట్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ ప్రాజెక్ట్ మూడు ఎకరాల్లో విస్తరించి ఉంది. రెడీ టూ మూవ్-3, 4, 5, 6 బీహెచ్ కే అపార్ట్ మెంట్లు ఇందులో ఉన్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles