poulomi avante poulomi avante

ఢిల్లీలోనే క‌ల‌ల‌గృహం క‌ట్టుకుంటా!

  • రియల్ ఎస్టేట్ గురుతో నటి రితికా నాయక్

కలలసౌధం ఎలా ఉండాలనే అంశంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ విషయానికి సంబంధించి ఎంతోమంది సెలబ్రిటీల అభిప్రాయాలను పాఠకులతో పంచుకున్న రియల్ ఎస్టేట్ గురు.. తాజాగా అశోకవనంలో అర్జున కల్యాణం నటి రితికా నాయక్ తలుపు తట్టింది. కలలసౌధం గురించి ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మొదటి ఇంటి గురించి కొన్ని సంగతులు వివరించారు.

‘మాది సూక్ష్మ కుటుంబం. మేం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న ఇల్లు అంత పెద్దది ఏమీ కాదు. చాలా చిన్న ఇల్లు. కేవలం సింగిల్ బెడ్ రూం ఇల్లు. ఆ సమయంలో పెద్ద బంగ్లా కట్టుకోవాలని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ మేం గడిపిన ఆ 1 బీహెచ్ కే ఇల్లు మాకు మరచిపోలేని మధురానుభూతులు మిగిల్చింది. బయట టెర్రస్ ఉండేది. దానిపై నేను ఆడుకుంటూ ఉండేదాన్ని. చాలాసేపు అక్కడ బొమ్మలతో ఆడుకున్న తర్వాత కిచెన్ లో ఉన్న అమ్మ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లి, ఆమెకు చిరాకు తెప్పించేదాన్ని. అప్పుడు ఎల్ సీడీలు లేవు. రిమోట్ లేని టీవీలో కార్టూన్లు చూసేదాన్ని. అప్పుడు అదే నా జీవితం’ అని పేర్కొన్నారు.

dream house

ప్రస్తుతం రితిక తాను ఉంటున్న ఇంట్లో ప్రతి భాగాన్నీ అమితంగా ఇష్టపడతారు. ఇక తన కలల సౌధం ఎలా ఉండాలనే అంశంపై ఆమె మాట్లాడుతూ.. ‘భిన్న ధృవాల కలయికగా నా ఇల్లు ఉండాలని కోరుకుంటాను. వాస్తవానికి నేను చెప్పకపోయినా, ప్రస్తుతం నా గది కూడా మీకు నా గురించి ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని వెల్లడిస్తుంది. నా గదిలో కృత్రిమ మొక్కలతోపాటు దీపాలు, బుక్ షెల్ప్ తదితరాలు చూస్తారు. నా కోసమే లేక నా కుటుంబం కోసమో విల్లాలు లేవు. నా జీవితంలో అమ్మే నాకు అన్నీ. మేం ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉంటాం. నా కలల సౌధంలో తప్పకుండా అతిథి గది ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే మా ఇంటికి స్వేచ్ఛగా రావొచ్చు. నా స్నేహితులే నా కుటుంబ సభ్యులు. మేమంతా ఎక్కువగా కలిసే ఉంటాం. అందువల్ల మాకు పెద్ద స్థలం ఉంటే బాగుంటుంది’ అని రితిక తన మనసులో మాట బయటపెట్టారు.

షూటింగ్ లేనప్పుడు రితిక ఎక్కడ ఉంటారు అని అడగ్గా.. బెడ్ రూంలో అని సమాధానమిచ్చారు. తన కలల ఇంటిని చూశాక తొలి చూపులోనే ప్రేమలో పడతానని పేర్కొన్నారు. ఇంకా తన ఇంటి గురించి ఆమె ఎలాంటి దాపరికం లేకుండా బోలెడు సంగతులు చెప్పారు. ‘ఇన్నేళ్లుగా నేను ఎంత డబ్బు సంపాదించినా సరే, నేను మళ్లీ నా పుట్టిల్లు ఢిల్లీకే వస్తాను. ఇక్కడే నా కలల సౌధం కట్టుకుంటాను. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎన్నో నేర్చుకున్నాను. నా బాల్యం మొత్తం ఇక్కడే గడిచింది. నా అనుబంధం ఇక్కడే పెన వేసుకుని ఉంది’ అని రితికా నాయక్ స్పష్టం చేశారు. సెలబ్రిటిల్లో ఎవరి ఇల్లు నచ్చిందని అడగ్గా.. ‘నేను ముంబైలో ఉన్నప్పుడు షారూఖ్ కాన్ ‘మన్నత్’ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. అది నాపై ఎంతగా ప్రభావం చూపించిందంటే.. దాని చరిత్ర మొత్తం శోధించాను. అది ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన ఆస్తిగా ఉండిపోతుందని నా ప్రగాఢ విశ్వాసం’ అని చెప్పి ముగించారు.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles