poulomi avante poulomi avante

మొక్క‌లు నాటేవారికి.. గ్రీన్ పాస్ పుస్తకం ఇవ్వాలి!

  • హరితహారానికి అలేఖ్య హోమ్స్ సెల్యూట్
  • వాతావరణ మార్పుల్ని ప్రతిఒక్కరూ గమనించాలి
  • యువత, గృహిణులు, ఉద్యోగులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు..
    ప్ర‌తిఒక్క‌రూ ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించాలి!
  • అప్పుడే మ‌నం భూమాతను రక్షించుకోగ‌ల్గుతాం

ఓ మహా సముద్రం ఏర్పడటానికి ప్రతి నీటి చుక్క ఎంత అవసరమో..
ఓ మహా సౌధం కట్టడానికి ప్రతి ఇటుక ఎంత అవసరమో..
ఓ అడవిని సృష్టించడానికి ప్రతి విత్తనమూ అంతే అవసరం.

రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలకు, హరితహారం కార్యక్రమానికి సెల్యూట్ చేస్తున్న‌ట్లు అలేఖ్య హోమ్స్ తెలిపింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో.. చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ తదితరుల ప్రత్యేక కృషి వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని.. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభించిందని తెలియజేసింది. హరితహారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నమస్కారం చేస్తున్నట్టు పేర్కొంది. ఓ బాధ్యతాయుతమైన వ్యక్తిగా పచ్చదనం వైపు.. ప్ర‌తిఒక్క‌రూ అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అభిప్రాయపడింది.

ఈ భూమాతను పరిరక్షించుకునేందుకు ఒక చిన్న అడుగు వేయాల‌ని అలేఖ్య హోమ్స్ చెబుతోంది. కొన్ని చదరపు అడుగులు ఉండే కిచెన్ గార్డెన్ నుంచి మైళ్ల కొద్దీ ఉండే ఖాళీ స్థలాల వరకు.. పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఒక్క అడుగు చాల‌ని చెబుతోంది. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కంపెనీలు, సంస్థలకు పిలుపునిచ్చింది. ఇందుకోసం పలు సూచనల్ని చేసింది.

  • మొక్కలు, చెట్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. ఒక కుండీలో పెట్టిన మొక్క, ఒక పెద్ద చెట్టు ప్రతిరోజూ మనకు అనేక లాభాల్ని అందజేస్తుంది.
  • గ్రీనరీ పెరుగుదలను ట్రాక్ చేసి రివార్డు పాయింట్లుగా మార్చే యాప్ ను సృష్టించాలి.
  • సాంకేతికంగా అంతగా అవగాహన లేనివారి కోసం గ్రీన్ పాస్ బుక్ ఇచ్చి.. మొక్కలు నాటినప్పుడల్లా గ్రీన్ పాయింట్లను అందజేయాలి.
  • మొక్కలు మాత్రమే కాకుండా మొత్తం పార్కు లేదా బహిరంగ స్థలాన్ని దత్తత తీసుకుని నిర్వహించాలి.
  • ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తరచుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. * వ్యవసాయ నిపుణులు, వృక్ష శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు, ల్యాండ్ స్కేప్ ఆర్కిటెక్టులు, విద్యార్థులు, పరిశోధకులు, ప్రొఫెసర్లు, సంబంధిత ప్రతి వ్యక్తీ ముందుకొచ్చి పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.

సుభాష్ పాలేక‌ర్లు కావాలి

అలేఖ్య హోమ్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించే అనేక కార్యక్రమాల్ని నిర్వహించింది. వివిధ వర్షపు నీటి పద్ధతులు పాటించడంతోపాలు నేలను సరైన విధంగా నిర్వహించడం వంటి చర్యల ద్వారా స్థానిక జీవ వైవిధ్యాన్ని సుసంపన్నం చేసింది. చిన్నారులు, గ్రుహిణులు, రిటైర్డ్ వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు వంటి వారికి అవగాహన కల్పిస్తూ వారిని గ్రీన్ వారియర్లుగా తయారు చేస్తోంది. హరిత విప్లవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సుభాష్ పాలేకర్ వంటి వ్యక్తులు ఇంకా చాలామంది కావాలని అలేఖ్య హోమ్స్ ఎప్పుడూ చెబుతోంది.

జూలైలో ఎందుకింత వ‌ర్షం?

జూలైలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి అసాధారణ వర్షపాతాన్ని చూడలేదని, వాతావరణ మార్పుల్లో భాగంగానే ఇది సంభవించిందని, అందువల్ల ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త, నిపుణుడు వైకే రెడ్డి పేర్కొన్నారు. మనం ఉంటున్న ప్రదేశాలను పచ్చదనంతో నిండేలా చేయడానికి మరింత మంది వెంటనే స్వచ్ఛందంగా ముందుకు రావాలని అలేఖ్య హోమ్స్ పిలుపునిస్తోంది. దైవం వృక్షం రూపంలో ఉందని, ప్రకృతిని భగవంతుడితో సమానంగా భావిస్తామని అలేఖ్య హోమ్స్ విశ్వసిస్తున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని పురాణాల్లో పేర్కొన్న విషయాన్ని సంస్థ ప్రగాఢంగా విశ్వసిస్తుంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles