Categories: LATEST UPDATES

నార్త్ ఇండియాపై అపర్ణా ఎంటర్ ప్రైజెస్ కన్ను

యూపీవీసీ డోర్లు, విండోల మార్కెట్లో 25శాతం వాటా దక్కించుకోవాలని యోచన
బిల్డింగ్ మెటీరియల్స్ తయారీ కంపెనీ అపర్ణా ఎంటర్ ప్రైజెస్ యూపీవీసీ బ్రాండ్.. ఓకోటెక్ ఉత్తర భారతదేశ యూపీవీసీ మార్కెట్ పై దృష్టి సారించింది. వచ్చే రెండేళ్లలో యూపీవీసీ డోర్లు, విండోల సెగ్మెంట్ లో 25 శాతం మార్కెట్ షేర్ దక్కించుకోవాలని యోచిస్తోంది. ‘ఉత్తర భారతదేశంలో స్టాండ్ ఎలోన్ లేదా ఇండిపెండెంట్ ఇళ్ళ నుంచి పర్యావరణ అనుకూలమైన యూపీవీసీ ఉత్పత్తులకు చక్కని డిమాండ్ ఉంది. వీటితోపాటు హైరైజ్ అపార్ట్ మెంట్ల నుంచి కూడా డిమాండ్ పెరుగుతోంది’ అని అపర్ణా ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణా రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తులను 200 మార్కెట్లకు విస్తరించాలని కంపెనీ యోచిస్తోంది. యూపీవీసీ డోర్లు, విండోల డిమాండ్ కు తగినట్టుగా తమ ఉత్పత్తిని తదుపరి ఏడాది నాటికి మరో 70 శాతం మేర పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అపర్ణా ఎంటర్ ప్రైజెస్ యూపీవీసీ డివిజన్ ప్రెసిడెంట్ అండ్ సీఈఓ మహేశ్ చౌదరి వెల్లడించారు.

This website uses cookies.