హైదరాబాద్ నడిబొడ్డున ఓ అతి సుందరమైన ప్రాజెక్టు ప్రారంభమైంది. హుస్సేస్ సాగర్ చెరువుకు అభిముఖంగా.. లగ్జరీకే సిసలైన చిరునామాగా నిలిచే ప్రాజెక్టు ‘బ్లిస్’ను ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ ఆరంభించింది. ఈ సంస్థకు హైదరాబాద్ నిర్మాణ రంగంలో దాదాపు ముప్పయ్యేళ్ల అనుభవం ఉంది.
17 అంతస్తుల ఎత్తులో.. రెండు టవర్లు
మొత్తం 153 ఫ్లాట్లు
ఫ్లాట్ విస్తీర్ణం.. 2,200 నుంచి 5,200 చ.అ.
ఒక్కో ఫ్లాటుకు 3 కారు పార్కింగులు
రాజ్ భవన్ రోడ్డులోని ’ద పార్కు‘ హోటల్ పక్కనే సుమారు 17 అంతస్తుల ఎత్తులో నిర్మితమవుతున్న ప్రాజెక్టే.. ’బ్లిస్‘. ఇందులో వచ్చేవి రెండు టవర్లు. మొత్తంగా, దాదాపు సుమారు ఐదు లక్షల చదరపు అడుగుల్లో ఈ నిర్మాణం వస్తోంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం.. దాదాపు 2,200 నుంచి 5,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. కనీసం 500 కార్లను నిలుపుకునే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది. అంటే, ఒక్కో కుటుంబానికి ఎంతలేదన్నా మూడు కార్ల పార్కింగ్ సదుపాయాన్ని అందజేస్తోంది. కేవలం 153 కుటుంబాల కోసమే 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌజ్ నిర్మిస్తున్నారు.
2022 మార్చిలో కొనుగోలుదారులకు అందించేందుకు శరవేగంగా నిర్మాణ పనులు జరుపుకుంటున్న ’బ్లిస్’ ప్రాజెక్టుకు సంబంధించి పదిహేడు అంతస్తుల రెండు స్ట్రక్చర్లు పూర్తయ్యాయి. ఫైవ్ లెవెల్ క్లబ్ హౌజ్ నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్నాయి. మరి, మీరు కూడా ఈ సుందర నిర్మాణంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ప్రదీప్ కన్ స్ట్రక్షన్స్ ను సంప్రదించండి.