Categories: LATEST UPDATES

ఆర్కిటెక్టులకు ఓసీలు ఇవ్వొచ్చా?

లైసెన్స్ డ్ కాలనీల్లోని ప్లాటెడ్ ఇళ్లకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేసే అధికారాన్ని అధీకృత ఆర్టిటెక్టులకు ఇవ్వాలని డీటీసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం, ఇంటి యజమానికి సులభంగా ఓసీ రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం వల్ల అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అక్రమ కట్టడాలకు అనుమతి ఇవ్వడంతోపాటు ఆర్కిటెక్టులు ఉల్లంఘనలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానాలు వస్తున్నాయి. వీటిని అధికారులు కొట్టిపారేస్తున్నారు. భవన ప్లాన్లు, వాస్తవ నిర్మాణాలను తరచుగా చెక్ చేస్తామని, ఎక్కడైనా ఉల్లంఘనలకు కనిపిస్తే సదరు ఆర్కిటెక్ట్ పై చర్యలు తీసుకోవడంతోపాటు వారిని బ్లాక్ లిస్టులో పెడతామని చెబుతున్నారు.

ప్రస్తుతం ఓసీ తీసుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఆర్కిటెక్టులు తమ ప్లాన్లను డీటీసీపీకి సమర్పించాలి. వివిధ స్థాయిల్లో వాటిని పరిశీలించిన తర్వాత అధికారుల బృందం ఆ ఇంటిని తనిఖీ చేస్తుంది. నిబంధనల ప్రకారమే నిర్మాణం జరిగిందా లేదా చూసిన తర్వాత ఓసీ జారీ చేస్తుంది. ఇదంతా పూర్తికావడానికి కొన్నివారాలు ఒక్కోసారి నెలలు కూడా పడుతోంది. ఈ నేపథ్యంలో ఆర్కిటెక్టులకు ఆ అధికారం ఇవ్వాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

This website uses cookies.