తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరు కరెక్టుగానే ఉందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, గత ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పేరుకుపోయిన చెత్త మొత్తం ఎగిరిపోతుందని చెబుతున్నారు. జీవో నెం. 50 అమల్లోకి తేవడం.. ప్రీలాంచ్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం.. గజానికి, చదరపు అడుక్కీ తేడా తెలియని వారంతా నిర్మాణ రంగంలోకి వచ్చేసి.. ఎలాంటి అనుమతుల్ని తీసుకోకుండా.. హండ్రెడ్ పర్సంట్ పేమెంట్ మీద ఫ్లాట్లను విక్రయించడం.. అందులో కొన్నవారు కొంతమంది మోసపోవడం..
పలువురు బిల్డర్లు ప్రాజెక్టులను ఆరంభించకపోవడం.. అందులో అనేకమంది ప్రస్తుతం కోర్టులు, టీజీ రెరా, బిల్డర్లు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుని నిలబడినవారే నిర్మాణ రంగంలో నిలబడతారని.. మిగతా చెత్త మొత్తం మార్కెట్ నుంచి ఎగిరిపోతుందని రియల్టర్లు అంటున్నారు. అందుకే, సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నదని కరెక్టేనని కొందరు నిపుణులు చెబుతున్నారు.
This website uses cookies.