అమెరికా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటో క్లేవ్ ఏరియేటేడ్ సిమెంట్ (ఏసీసీ) బ్లాకుల్ని ఇంటి నిర్మాణంలో వాడటం మన వద్ద పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, రామగుండం వంటి పట్టణ ప్రజలకు సుపరిచితమైన గౌతమీ ఎకోలైట్ సంస్థ ఏఏసీ బ్లాకుల్ని ఉత్పత్తి చేస్తోంది. అక్కడ్నుంచి రాష్ట్రమంతటా సరఫరా చేస్తోంది. వీటి వాడకం గురించి అటు నిర్మాణ సంస్థల్లో ఇటు గృహ యజమానుల్లో ఎంతో అవగాహన పెరిగింది. గౌతమీ సంస్థ వద్ద తయారయ్యే ఏసీసీ బ్లాకుల్ని నాణ్యంగా తయారు చేస్తారు. ఎన్‌టీపీసీలో ఉత్పత్తి అయ్యే అత్యుత్తమ ఫ్లయాష్, 53 గ్రేడ్ సిమెంట్, రాజస్థాన్ నుంచి నాణ్యమైన సున్నం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి వాటిని ఈ ఏఏసీ బ్లాకుల్లో వినియోగిస్తారు. మరి, ఈ ఇటుకల వల్ల కలిగే ప్రయోజనాలేమిటో తెలుసా?
శబ్దంతో పాటు అగ్నివ్యాప్తిని అరికడుతుంది కాబట్టి, ఈ తరహా ఇటుకల్ని ఆస్పత్రులు, విద్యా సంస్థలు, స్టూడియోలు వంటివాటిలో నిర్మించేందుకు ప్రాధాన్యతివ్వడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని గుర్తుంచుకోండి. వీటి ప్రత్యేకతల్ని అర్థం చేసుకున్న అనేక మంది ప్రజలు ఏఏసీ ఇటుకలతోనే తమ ఇంటిని నిర్మిస్తున్నారు. మన్నికతో పాటు ఖర్చు ఆదా అవుతుందనే విషయాన్ని గమనించిన నిర్మాణ సంస్థలూ వీటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. పైగా ఇళ్లను కట్టేటప్పుడు ఏఏసీ బ్లాకులు విరిగిపోవడం కానీ వృథా కానీ ఎక్కడా పెద్దగా కనిపించదు.
ఈ ఇటుకల ధర పొడువు, వెడల్పు, మందం బట్టి ఉంటుంది. ఉదాహరణకు, 2 అడుగులు x 8 అంగుళాలు x 4 అంగుళాల ఇటుక ధర దాదాపు రూ.40 అవుతుంది. ఒక్కో ఇటుక ఎంతలేదన్నా 1.4 చదరపు అడుగుల స్థలానికి సరిపోతుందన్నమాట. ఓ వంద చదరపు అడుగుల స్థలానికి ఎంతలేదన్నా రూ.70 ఇటుకలు సరిపోతాయని గుర్తుంచుకోండి. అంటే, ఓ రూ. 2800తో వంద చదరపు అడుగుల గోడల్ని కట్టుకోవచ్చు. మనకు నచ్చిన మందంలో, సైజుల్లో ఇవి లభిస్తాయని మర్చిపోవద్దు.
ప్రజలతో బాటు డెవలపర్లకు ఏఏసీ బ్లాకుల వినియోగం గురించి అర్థమైంది. ఇప్పుడైతే వీటిని చాలామంది వినియోగిస్తున్నారు. మాకు కాల్ చేసి చెబితే చాలు.. మీరు నచ్చిన చోట చేరవేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఏఏసీ బ్లాకుల తయారీ ప్లాంటును మేం ఎప్పుడో పెట్టాం. ప్రస్తుతం అక్కడ్నుంచి రోజు హైదరాబాద్‌లోని ఏ మారుమూల ప్రాంతానికైనా డెలివరీ చేస్తాం- సోమారపు సత్యనారాయణ, మేనేజింగ్ పార్టనర్, గౌతమీ ఏఏసీ బ్లాక్స్
This website uses cookies.