అందరూ ఊహించినట్టుగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రేటును మరోసారి పెంచింది. వరుసగా ఆరోసారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో అది 6.5 శాతానికి చేరింది. దీంతో ఇప్పటివరకు 6.25 శాతం ఉన్న వడ్డీ రేటు 6.5 శాతానికి చేరింది. అలాగే ఎంఎస్ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరింది.
తాజా రేట్ల పెంపు ప్రభావం అన్ని రకాల రుణాల రేట్లపై పడనుంది. అన్ని రకాల లోన్లపై రుణ భారం దాదాపు రెండు నుంచి నాలుగు శాతం వరకు పెరగనుంది. దీంతో ఈఎంఐల భారం రెట్టింపు కానుంది. ఇప్పటికే ఐదు సార్లు పెరిగిన రెపో రేటుతో బ్యాంకులు కూడా ఆ మేరకు వడ్డీ రేట్లు పెంచాయి. ఫలితంగా ఆ మేరకు ఈఎంఐ లేదా కాల వ్యవధి పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా మరోసారి రెపో రేటు పెరగడంతో ఈ భారం మరింత పెరగనుంది.
This website uses cookies.