Categories: LATEST UPDATES

దేశంలో ప్రప్రథమ గ్రీన్ ప్రాపర్టీ షో

ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ గ్రీన్ ప్రాపర్టీ షో మొదటి ఎడిషన్ జూలై 28, 29 మరియు 30 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగనుంది. దీనికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా భాగస్వామ్య రాష్ట్రంగా చేరింది. ఈ ఎక్స్‌పోలో నిర్మాణ ఉత్పత్తులు మరియు సేవలతో పాటుగా గ్రీన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలను ప్రదర్శిస్తారు. 75 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లు గ్రీన్ ప్రాపర్టీలు, ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శిస్తారు.

ఈ సందర్భంగా సిఐఐ తెలంగాణ చైర్మన్ సి. శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ” హైదరాబాద్ లో ఐజిబిసి గ్రీన్ ప్రాపర్టీ షోలో పాల్గొనడం వల్ల డెవలపర్‌లు తమ గ్రీన్-రేటెడ్ ప్రాజెక్టులను ప్రదర్శించేందుకు, హరిత భవనాలు మరియు నిర్మిత పర్యావరణం పట్ల తమ నాయకత్వాన్ని, నిబద్ధత ను ప్రదర్శించేందుకు చక్కటి వేదికను పొందవచ్చు. సాంప్రదాయ భవంతుల కంటే గ్రీన్ రేటింగ్ ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడం యొక్క ప్రాముఖ్యత, ఇది వారికి అందించే అపారమైన ప్రయోజనాలు మరియు అవి సుస్థిరతకు ఎలా దోహదపడతాయి, సహజ వనరులను పరిరక్షించడం మరియు పర్యావరణ ప్రభావాలు తగ్గించడం వంటి వాటిపై సాధారణ ప్రజల్లో మరింత అవగాహన తీసుకురావడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం…” అని అన్నారు.

“ తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్ కాంప్లెక్స్, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ మరియు ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్, హుడా అనెక్స్ బిల్డింగ్, పరిశ్రమల కమిషనర్ భవన్ , అబిడ్స్, హైదరాబాద్ భవన్, వంటి ప్రాజెక్టులతో తెలంగాణ మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంది. వీటితో పాటు అనేక ఇతర ప్రాజెక్టు లు ఐజీబీసీ గ్రీన్ రేటింగ్‌లను స్వీకరించాయి. ఇది మన రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి ప్రేరణనిచ్చింది మరియు ఐజీబీసీ గ్రీన్ హోమ్స్ మరియు బిల్డింగ్‌ల రూపకల్పన, అభివృద్ధి మరియు నిర్వహణతో ఇప్పటికే అనేక మంది ప్రముఖ డెవలపర్‌లను కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము.

ఐజీబీసీ వద్ద మేము ఈ ప్రదర్శన ఒక ప్రేరణగా నిలుస్తుందని ఆశిస్తున్నాం. దీని నుండి ఇతరులు ప్రేరణ పొంది భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా తమ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు” అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐజిబిసి హైదరాబాద్ చాప్టర్ కో-ఛైర్మన్ ఏఆర్ శ్రీనివాస మూర్తి, సిఐఐ – ఐజిబిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ వెంకటగిరి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

This website uses cookies.