Categories: CONSTRUCTION

ఐదు రోజులకో ఫ్లాటు?

హైదరాబాద్లో అపార్టుమెంట్ల నిర్మాణ పనులు అల్యుమినియం ఫోమ్ వర్క్ విధానంలోకి మారింది. దీన్నే మైవాన్ ఫ్రేమ్ వర్క్ అని కూడా పిలుస్తారు.

సంప్రదాయ విధానంలో ఒక అపార్టుమెంట్లోని ఫ్లాట్ కు సంబంధించిన సివిల్ పనులు పూర్తవ్వడానికి మూడు నుంచి నాలుగు నెలలవుతుంది. శ్లాబులు కొట్టడానికి పదిహేను రోజులు, శ్లాబు వేశాక పదిహేను రోజులకు షట్టరింగ్ తీయడం.. గోడల్ని కత్తరించి పైపు లైన్ వేసేవారు. తర్వాత దాన్ని మూసివేసి గోడలు ప్లాస్టరింగ్ చేయడం, ఎక్స్ టర్నల్ ప్లాస్టరింగ్ చేసేవారు. కానీ, మైవాన్ షట్టరింగ్ విధానంలో మాత్రం ఇందుకు భిన్నంగా చేస్తారు. ఎలక్ట్రికల్ కాండ్యూట్లతో పాటు గోడల్ని ఆర్సీసీతో వేసి.. శ్లాబులు వేస్తారు. ఇలా, ఐదు రోజులకొక ఫ్లాట్ చొప్పున సివిల్ పనుల్ని పూర్తి చేస్తారు. దీనికి ఎక్స్ టర్నల్ ప్లాస్టిరింగ్ కూడా అవసరం లేదు.

అల్యూమినియం ఫోమ్ వర్క్ విధానంలో నిర్మాణం చేపడితే.. అంతర్గత మార్పులు చేసుకోవడానికి కుదరదు. ఎలక్ట్రికల్ పాయింట్లో కానీ గోడల్లో కానీ మార్పులు చేసుకోలేం. ఈ నిర్మాణం మొత్తం గోడలతో సహా ఆర్ సీసీతోనే కట్టేస్తారు. అందుకే, భూకంపాల్ని తట్టుకునే తత్వం మెరుగ్గా ఉన్నప్పటికీ, ఎండాకాలంలో ఇంటి లోపల వేడి కొంత ఎక్కువుండే అవకాశమున్నది.

This website uses cookies.