గోద్రేజ్ గ్రూప్ కి చెందిన గోద్రేజ్ అండ్ బోయ్స్.. ప్రీమియం ఎయిర్ కండిషనర్లను తీసుకొచ్చింది. అధునాతన కూలింగ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీతో వీటిని రూపొందించినట్టు ప్రకటించింది. యూవీ కూల్ టెక్నాలజీ, నానో కోటెడ్ యాంటీ వైరల్ ఫిల్ట్రేషన్ వంటి పలు ప్రత్యేకతలున్నట్టు తెలిపింది. టెక్కీ వినియోగదారులను పెంచే ఉద్దేశంతో వారినే లక్ష్యంగా చేసుకుని స్మార్ట్ కంట్రోల్స్ తో ఈ ప్రీమియం ఏసీలు రూపొందించినట్టు వివరించింది.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం పెరగడం.. కరోనా మహమ్మారి కారణంగా వినియోగదారుల ప్రవర్తనలో విప్లవాత్మక మార్పులు రావడంతో డిజిటల్, సాంకేతికత వినియోగం ఎక్కువైంది. ఈ క్రమంలో టెక్ ఆధారిత పరికరాలకు డిమాండ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఏసీలకు ఆదరణ పెరుగుతుండటంతో గోద్రేజ్ సైతం ఆ దిశగా దృష్టి సారించింది. గోద్రేజ్ ఇయాన్ ఢి సిరీస్ ఎయిర్ కండిషనర్లను తీసుకొచ్చింది.
ఇప్పటికే గోద్రేజ్ నుంచి వచ్చిన కొన్ని ఏసీల్లో వీటిలో కొన్ని ప్రత్యేకతలు ఉండగా.. డి సిరీస్ ఏసీల్లో కొత్తగా కొన్నింటిని ప్రవేశపెట్టింది. ఈ ఏసీలు వైఫైతో కూడా పనిచేస్తాయి. అలాగే అలెక్సా, గూగుల్ హోం అనుకూలతో వాయిస్ ఎనేబుల్ చేశారు. ఉష్ణోగ్రత, ఫ్యాన్ స్పీడ్, మోడ్ సెట్టింగ్, షెడ్యూల్ సమయాన్ని, ఏసీల పనితీరును ఫోన్ యాప్ ద్వారా సులభంగా పర్యవేక్షించవచ్చు. గోద్రేజ్ ఇయాన్ డి సిరీస్ ఏసీలు ఈ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ లతోపాటు ఆఫ్ లైన్ పాన్ ఇండియా స్టోర్లలో వైట్, కాపర్, రోజ్ గోల్డ్ రంగుల్లో దొరుకుతాయిని సంస్థ వెల్లడించింది.