poulomi avante poulomi avante

డూప్లెక్స్ అపార్ట్ మెంట్.. రూ.226 కోట్లు

  • డూప్లెక్స్ అపార్ట్ మెంట్.. రూ.226 కోట్లు
  • ముంబై వర్లిలో కొనుగోలు చేసిన ఆది గోద్రేజ్ కుమార్తె

ముంబైలో మరో లగ్జరీ రియల్ ఎస్టేట్ డీల్ చోటు చేసుకుంది. గోద్రేజ్ గ్రూప్ అధిపతి ఆది గోద్రేజ్ కుమార్తె తాన్య దుబాష్ కు చెందిన గోద్రేజ్ అనుబంధ సంస్థ ముంబై వర్లీలో రూ.226 కోట్లతో ఓ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. వర్లి సీ ఫేస్‌లోని ప్రీమియం నమన్ జానా డెవలప్‌మెంట్‌లో ఈ అపార్ట్ మెంట్ ఉంది. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ ప్రాపర్టీని గోద్రేజ్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన షౌలా రియల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కొనుగోలు చేశారు.

అదే లగ్జరీ ప్రాజెక్టులో ఫార్మాస్యూటికల్ సంస్థ యూఎస్ వీ చైర్‌పర్సన్ లీనా గాంధీ తివారీ గత నెలలో మొత్తం రూ.639 కోట్లకు కొనుగోలు చేసిన రెండు డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్‌లు కూడా ఉన్నాయి. ఇందుకోసం ఆమె దాదాపు రూ.63.9 కోట్ల స్టాంపు డ్యూటీ కూడా చెల్లించారు. దీంతో ఈ లావాదేవీ మొత్తం విలువ దాదాపు రూ.703 కోట్లకు చేరుకుంది, ఇది దేశంలో నమోదైన అత్యంత ఖరీదైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ గా నిలిచింది.

ALSO READ: హైద‌రాబాద్‌లో క్యాష్ క్యాంపోనెంట్ ఎక్కువ

కాగా, గోద్రేజ్ గ్రూప్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ అయిన తాన్య దుబాష్.. ఈ లగ్జరీ ప్రాజెక్టులో ఓ డూప్లెక్స్ అపార్ట్ మెంట్ ను రూ.225.7 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే చదరపు అడుగు ధర రూ.2.16 లక్షలుగా పడింది. ఈ యూనిట్ సముద్రానికి ఎదురుగా ఉన్న నమన్ క్సానా ప్రాజెక్ట్ 30, 31వ అంతస్తులలో విస్తరించి ఉంది. దీంతోపాటు ఐదు కార్ పార్కింగ్ స్థలాలు కూడా వచ్చాయి.

ఈ అపార్ట్ మెంట్ ను నామన్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, కార్ప్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశారు. ఈ డ్యూప్లెక్స్ యూనిట్ 856 చదరపు మీటర్ల (9,214 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా, 114 చదరపు మీటర్ల (1,227 చదరపు అడుగులు) బాల్కనీ కలిగి ఉంది. అపార్ట్ మెంట్ మొత్తం బిల్ట్-అప్ ఏరియా 1,067 చదరపు మీటర్లు (11,485 చదరపు అడుగులు).

మే 26న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ. 13.55 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. ముంబైలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్లలోని వర్లి పరిమిత భూమి, అధిక మూలధన విలువలను కలిగి ఉంది. వర్లి ముంబైలో అధిక డిమాండ్ ఉన్న ప్రాంతం. ఇది లోయర్ పరేల్, నారిమన్ పాయింట్, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ వంటి ప్రధాన వాణిజ్య మండలాల మధ్య ఉంది.

spot_img
Hallmarkinfracon imperia

Hot Topics

Related Articles