తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి అపార్టుమెంట్ల విలువల్ని సవరించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సరికొత్త జీవోను విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాల్లో నివాస మరియు వాణిజ్య సముదాయాల్లో అపార్టుమెంట్ల విలువలు ఇలా ఉన్నాయి. మాదాపూర్చ గచ్చిబౌలి, కొండాపూర్, మంచిరేవుల, ఖాజాగూడ, నానక్‌రాంగూడ వంటి ప్రాంతాల్లో ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు ఇక నుంచి చదరపు అడుక్కీ 3000 నుంచి 4500 చొప్పున లెక్కిస్తారు.
పిరంచెరువు, పొప్పాల్‌గూడ, మణికొండ, నార్సింగి, బండ్లగూడ, కొల్లూరు, అమీన్‌పూర్ వంటి ప్రాంతాల్లో చదరపు అడుక్కీ 2200 చొప్పున లెక్కిస్తారు. ఇదే ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాల్ని రిజిస్టర్ చేసుకోవాలంటే చదరపు అడుక్కీ 3000 నుంచి 7300 చొప్పున లెక్కిస్తారు. మియాపూర్ నుంచి బొల్లారం రోడ్డులో కొత్తగా కట్టే అపార్టుమెంట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చదరపు అడుక్కీ 3800 చొప్పున లెక్కిస్తారు. అంటే, ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి 1500 చదరపు అడుగుల ఫ్లాట్ కొన్నారనుకుందాం.. సుమారు రూ.4.30 లక్షల (3800 1500గ 7.5జ100) దాకా రిజిస్ట్రేషన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రాంతం | కొత్త విలువ | |||
ఫ్లాటు రేటు | వాణిజ్య రేటు | |||
పిరంచెరువు | 2200 | 3000 | ||
కోకాపేట్ | 2200 | 3000-7300 | ||
మణికొండ | 2200 | 4500 | ||
కిస్మత్ పూర్ | 2200 | 5600 | ||
నార్సింగి | 2200 | 7300 | ||
నెక్నాంపూర్ | 2200 | 7300 | ||
మంచిరేవుల | 3000 | 7300 | ||
హైదర్షాకోట్ | 2200 | 3000 | ||
బండ్లగూడ జాగీర్ | 2200 | 4500- 7300 | ||
మియాపూర్ | 2200 | 4500 | ||
మియాపూర్- బొల్లారం | 3800 | 7300 | ||
పొప్పాల్‌గూడ | 2,200 | 6600-7300 | ||
కొండాపూర్ | 3000 | 4500 7300 | ||
మాదాపూర్ | 3000 | 4500 7300 | ||
గచ్చిబౌలి | 3000 | 4500 7300 | ||
గోపనపల్లి | 2500 | 4500 | ||
గుట్టల బేగంపేట్ | 3000 | 4500 7300 | ||
హఫీజ్‌పేట్ | 2500- 3800 | 4500-7300 | ||
ఖాజాగూడ | 3000-4500 | 4500-7300 | ||
మదీనాగూడ | 2800- 4500 | 4500-7300 | ||
నలగండ్ల | 2500 | 4500 | ||
నానక్‌రాంగూడ | 3000 | 4500 7300 | ||
ఓల్డ్ ముంబైహైవే | 7300 | |||
రాయదుర్గం (పాన్‌మక్తా) | 3000-4500 | 4500-7300 | ||
శేరిలింగంపల్లి | 2500 | 4500-7300 | ||
రామచంద్రాపురం | 2500 | 3000 | ||
కూకట్ పల్లి | 2800- 3800 | 4500-7300 | ||
హైదర్ నగర్ | 2800- 3800 | 4500-7300 | ||
మూసాపేట్ | 2500- 3800 | 7300 | ||
బీఎన్‌రెడ్డి హిల్స్ | 2500 | |||
నందిహిల్స్ | 2500 | |||
అమీన్‌పూర్ | 2200 | |||
కొల్లూరు | 2200 | |||
తెల్లాపూర్ | 2200 | |||
ఉస్మాన్ నగర్ | 2200 |
This website uses cookies.