హైదరాబాద్ లో అమ్ముడుపోని ఇళ్ల ఇన్వెంటరీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. 2020లో 49,762 అమ్ముడుపోని ఇళ్లు ఉండగా.. దాని ఇన్వెంటరీ 1.68 సంవత్సరాలుగా ఉంది. 2021లో 80,110 ఇళ్లకు 1.57 సంవత్సరాలు, 2022లో 98,978 ఇళ్లకు 1.47 సంవత్సరాలు, 2023లో 1,19,245 ఇళ్లకు 1.59 సంవత్సరాలు, 2024లో 1,03,316 ఇళ్లకు 1.33 సంవత్సరాల ఇన్వెంటరీ ఉంది. కాగా, హైదరాబాద్లో మొదటి ఆరు నెలల్లో 62 శాతం విక్రయాలు నార్త్ వెస్ట్ లోనే జరిగాయి.
ఇక్కడ రూ.36,276 కోట్ల విలువైన ఇళ్లు అమ్ముడయ్యాయి. రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్య విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు 2019తో పోలిస్తే 449 శాతం పెరిగాయి. రూ.10 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ఇళ్ల అమ్మకాలు 63 శాతం పెరిగాయి. 2019లో సగటు ఇంటి విలువ రూ.1.1 కోట్లు ఉండగా.. ఇప్పుడు అది 44 శాతం పెరుగుదలతో రూ.కోటిన్నరగా ఉంది.
This website uses cookies.