హైదరాబాద్ రియల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. దేశ, విదేశీ ఐటీ మరియు ఉత్పత్తి సంస్థలు నగరంలోకి అడుగుపెడుతూ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. దీంతో, ఇక్కడి రియల్ రంగానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో అధిక శాతం మంది పశ్చిమ హైదరాబాద్‌లో సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు దృష్టి సారిస్తున్నారు. వీరంతా ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ అయిన కోకాపేట్‌లో స్థిర నివాసాన్ని ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారందరికీ అందుబాటులో ఉన్న ఒక చక్కటి ఆప్షనే.. పౌలోమీ అవాంతే. సుమారు డెబ్బయ్ శాతం నిర్మాణ పనుల్ని పూర్తి చేసుకుని శరవేగంగా ముందుకు దూసుకెళుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..
భవిష్యత్తు అభివృద్ధికి చేరువలో.. ఐటీ కార్యాలయాలకు సమీపంలో.. నిర్మాణ పనులను శరవేగంగా జరిగే ప్రాజెక్టుల్లోనే.. బయ్యర్లు ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ఐటీ హబ్ కు దగ్గర్లో.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోకాపేటలో.. పౌలోమీ ఎస్టేట్స్ చకచకా నిర్మిస్తున్న ప్రాజెక్టే.. పౌలోమీ అవాంతే. సుమారు 4.75 ఎకరాల స్థలంలో.. 3 బ్లాకుల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య 475 ఫ్లాట్లు మాత్రమ
రెండు సెల్లార్లు, గ్రౌండ్, 22 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. 1555 నుంచి 2575 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాతో త్రీ బీహెచ్ కే అపార్టుమెంట్ల లభిస్తాయి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్టులో 452 త్రీ బీహెచ్‌కే ఫ్లాట్లను నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులోని లాబీ ప్రవేశ మార్గాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంతగా ఆకట్టుకునేలా ఉంటాయి. ల్యాండ్ స్కేపింగ్ విషయంలో సంస్థ ఎక్కడా రాజీ పడలేదు. అదేవిధంగా, ప్రాజెక్టు చుట్టూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంది.
పౌలోమీ అవాంతే ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ్నుంచి గచ్చిబౌలికి ఐదు నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు, ఆస్పత్రులు, ఎంటర్ టైన్‌మెంట్ హబ్‌లు వంటి వాటికి ఐదు నుంచి పది నిమిషాల్లో చేరుకోవచ్చు. మాదాపూర్, హైటైక్ సిటీ, శంషాబాద్ విమానాశ్రయం వంటి వాటికి సులువుగా చేరుకోవచ్చు. పైగా, రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఏ జంక్షన్ నుంచి కొల్లూరు దాకా సర్వీస్ రోడ్డు మీద సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్‌ని సిద్ధం చేస్తోంది. అక్కడక్కడ రిఫ్రెష్‌మెంట్ ప్రాంతాల్ని కూడా అభివృద్ధి చేస్తోంది.
సకల సదుపాయాలతో 28 వేల చదరపు అడుగుల్లో అదిరిపోయే క్లబ్ హౌస్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఇందులో మల్టీపర్పస్ హాల్, ఇండోర్ జిమ్ మరియు ఔట్ డోర్ జిమ్, రెండు చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, క్రికెట్ పిచ్, బాస్కెట్ బాల్ హాఫ్ కోర్టు, 2250 చదరపు అడుగుల బ్యాడ్మింటన్ కోర్టు, ఫుట్‌సోల్ కోర్టు, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేస్తారు.
సూపర్ మార్కెట్, క్రెష్, యోగా హాల్, స్పా, బిలియర్డ్స్ రూమ్, గెస్ట్ రూములు, ఇండోర్ గేమ్స్, టెర్రస్ పూల్, కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు గల డెక్ ఏరియా వంటివి ప్రతిఒక్కర్ని అమితంగా ఆకర్షిస్తాయి. తమ అభిరుచిని కొనసాగించడానికి మరియు అర్ధవంతమైన జీవితాన్ని గడపడానికి ఇంతకు మించిన ప్రాజెక్టు లేదని ఇప్పటికే పౌలోమీ అవాంతేలో ఫ్లాట్లను కొనుగోలు చేసినవారు చెబుతున్నారు. మరి, ఇలాంటి మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్టును మీరేమాత్రం ఆలస్యం చేయకుండా విజిట్ చేయండి. ఒక్కసారి చూస్తే.. మీరు పౌలోమీ అవాంతేలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ఖాయం.
This website uses cookies.