Categories: LATEST UPDATES

బేస్ మెంట్ రూపురేఖలు మార్చేదెలా?

ఎక్కువ సొమ్ము వెచ్చించకుండా బేస్ మెంట్ ను అందంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారా? అయితే, ఈ కథనం మీకోసమే. బేస్ మెంట్ రూపురేఖలు మార్చే ముందు చెద పురుగులు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి. చెదలు ఎంత పట్టాయో అన్నదానిపైనే ఎంత ఖర్చు పెట్టాలి అనే విషయం అంచనా వేయగలుగుతాం. రీ మోడలింగ్ సమయంలో ఇంట్లో కొంత లేదా చాలా భాగం తొలగించాల్సిన అవసరం వస్తుంది. ఒకవేళ చెదపురుగులు కనిపిస్తే.. అంత మేర లోతుగా డ్రిల్లింగ్ చేసి మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. ఈ డ్రిల్లింగ్ కోసం ఫర్నిషింగులను కూడా తీసేయాల్సి రావొచ్చు. ఫర్నిషింగ్ పెట్టే ముందు ఆ స్పేస్ తనిఖీ చేస్తే, చెదపురుగులను పరిష్కరించడానికి మీకు ఏదైనా అధునాతన మరమ్మతులు అవసరమా అనేది తెలుస్తుంది.

మీ బెడ్ రూమ్ పూర్తిగా అసంపూర్తిగా ఉంది అంటే, మీరు మొదటి చేయాల్సిన పని ఫ్లోరింగ్. నిజానికి ఫ్లోరింగ్ అనేది చాలా ఖరీదైన పని. కానీ సరైన ఫ్లోరింగ్ లేకుంటే బేస్ మెంట్ లో ఉండాలనిపించదు. బేస్ మెంట్ కు సంబంధించిన ఫ్లోరింగ్ లో అనేక రకాలున్నాయి. మీ అభిరుచి, అవసరాలకు అనుగుణంగా ఒకదాన్ని ఎంచుకోవచ్చు. అలాగే ఒక సమయంలో ఒక ప్లేస్ లోనే పని ప్రారంభించండి. గదిలోని వివిధ భాగాలు, ఖాళీలను అవసరాలకు అనుగుణంగా మార్చండి. బేస్ మెంట్ పూర్తయిన తర్వాత గోడలు, సీలింగ్ పనులు చూడాలి. ఒకవేళ గోడలు, పైకప్పులకు రంగులు వేయాలనుకుంటే ముందుగా పైకప్పుతో ప్రారంభించి, ఆ తర్వాత గోడలకు పెయింటింగ్ వేయాలి. గోడలకు సరళమైన, సొగసన, తేలికపాటి షేడ్స్ ఉన్న రంగులు వేయిస్తే బాగుంటుంది. దీనివల్ల బేస్ మెంట్ ప్రకాశవంతంగా కనిపిస్తుంది. డార్క్ షేడ్స్ కాంతిని పీల్చుకుంటాయి. దీంతో బేస్ మెంట్ మురికిగా, తడిగా, చీకటిగా కనిపిస్తుంది.

బేస్ మెంట్స్ ఎప్పుడూ చీకటిగా, తడిగా ఉంటాయి. సరైన లైట్లను అమర్చడం ద్వారా వాటిని ప్రశాశవంతంగా కనిపించేలా చేయొచ్చు. అక్కడక్కడా కొన్ని బల్బులు వేలాడదీయడానికి బదులు, గది మొత్తం వెలుతురు వచ్చేలా ఫిక్చర్లను అమరిస్తే ఎంతో బాగుంటుంది. మరింత చక్కదనం కోసం యాంబియంట్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బేస్ మెంట్ రూపాన్ని మరింత మెరుగ్గా చేయడనికి లైటింగ్, రగ్గులు, తలుపులు, ఇతర ఉపకరాణాలను జోడించవచ్చు. కొన్ని సార్లు రీమోడలింగ్ చేస్తున్నప్పుడు కొన్ని పనులు చేయలేం. అలాంటి సందర్బాల్లో ముక మార్గనిర్దేశం చేయగల ప్రొఫెషనల్ రీమోడలర్లను నియమించుకోవడం మంచిది. ఇదేమీ పెద్ద ఖరీదైన వ్యవహారం కూడా కాదు. సరిగ్గా వెతికితే మీ బడ్జెట్ లోనే మంచి నిపుణులు దొరకడం ఖాయం. బేస్ మెంట్ ను పునరుద్ధరిస్తే ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా అక్కడ మీరు ఎక్కవ సమయం గడిపేలా చేస్తుంది. పైగా ఆస్తి విలువను కూడా పెంచుతుంది.

మ‌హిమా రావ‌త్‌,
కంటెంట్ స్ట్రాట‌జిస్ట్‌,
ఓరియెంట్ బెల్ టైల్స్‌.

This website uses cookies.