వ్యక్తిగత డిజైనింగ్ శైలిని ప్రతిబింబిస్తూనే.. ఇంటిని అత్యుత్తమంగా కనిపించేలా చేయడంపై.. కభీ ఖుషీ కభీ ఘమ్ ఫేమ్ మాళవికా రాజ్ కు పూర్తి అవగాహన ఉంది. ఇంటి డిజైన్ సౌకర్యవంతంగా ఉండాలని.. ఫర్నీచర్‌ని అడ్డదిడ్డంగా పెట్టకూడదనేది ఆమె అభిప్రాయం. తన కలల గృహం గురించి అనేక విషయాల్ని రియల్ ఎస్టేట్ గురుతో ఇలా చెప్పుకుంటూ వచ్చారు.
నేను పుట్టి పెరిగిన ఇంట్లోనే ఇంకా నివసిస్తున్నాను. అందులో నా బాల్యానికి సంబంధించి మధురమైన జ్ఞాపకాలున్నాయి. మొదటి పుట్టిన రోజు నుంచి మా అక్క పెళ్లయ్యేంత వరకూ అక్కడే ఉన్నాం. అదే ఇంటికి కొంచెం రంగులు వేయించి, మెరుగులు దిద్దితే అందంగా కనిపిస్తుందని భావించాం. అందుకే, ఇంటిని రెనోవేషన్ చేయించాం. ఉండటానికి స్థలం కాస్త మధ్యస్తంగా ఉన్నా.. ఎంతో అందంగా ఉంటుంది. ఇందుకోసం ఏం చేశానంటే.. నాణ్యత గల నిర్మాణ సామగ్రిని వినియోగించాను. చూడటానికి సౌందర్యంగా కనిపించేలా చేశాను. కాలానికి అనుగుణమైన అంశాల్ని డిజైనింగ్‌లో మిళితం చేసి ఆకర్షణీయంగా కనిపించేలా చేశా. గదులు సాంప్రదాయంగా లేదా ఆధునికంగా, అధికారికంగా లేదా రిలాక్స్‌గా మరియు వెచ్చగా లేదా చల్లగా ఉండవచ్చు. అయితే తనకేం కావాలనే అంశానికి వస్తే..
“మొదట నాకో బంగళా కావాలి. నా స్థలం చుట్టూ ఎలాంటి ఆంక్షలు ఉన్నా తట్టుకోలేను. అది బీచ్-ఫ్రంట్ బంగ్లా అయి ఉండాలి. అది నిజమైన ఖాళీ ఇల్లు! సోషల్ మీడియాని చెక్ చేయడానికి సమయం దొరకని విధంగా.. వేడిగా, పరిపూర్ణమైన అలలు మరియు ఆ ఇంటిలో నిమగ్నమై ఉండాలి. షూటింగ్ లేనప్పుడు టీవీ తెగ చూసేస్తాను. ఎలాగంటే.. ఒక చోట కూర్చోని సగం సీజన్ కూడా పూర్తి చేస్తాను. నా చుట్టూ సానుకూలత ఉండాలని కోరుకుంటాను. నా ఇంట్లో విచారానికి చోటు లేదు. అన్ని స్థాయిలలో సానుకూలత ఉండే విధంగా చూసుకుంటాను. ఒక పెద్ద వాక్-ఇన్ క్లోసెట్‌ను కలిగి ఉండటాన్ని ఇష్టపడతాను. చాలా బట్టలు కలిగి ఉన్నాను మరియు ప్రతి బ్రాండ్‌ను షాపింగ్ చేయలేను.”
This website uses cookies.