మనందరికీ సొంతిల్లు ఉండాలనే కోరిక ఉంటుంది. అదేవిధంగా ప్రేమా గీమా జాన్తా నహీ ఫేమ్ మన్నారా చోప్రా కూడా సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చక్కగా డిజైన్ చేయబడిన ఇంటిలో నివసించాలని కోరుకుంటుంది. విశ్రాంతి నుండి వినోదం వరకు తనకు కావలసిన ప్రతిదాన్ని పొందగలిగే ఇంట్లో నివసించాలని కలలు కంటోంది. అలాంటి ఇంట్లో నివసించడం ఖచ్చితంగా మంచి విషయమే కదా.. కాదంటారా? ఏదేమైనా, ఆమె ఇల్లు కావాల్సినంత సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తోంది. ఇంకా ఏమంటోందో.. ఆమె మాటల్లోనే..
“నేను కాస్త భిన్నమైన అమ్మాయిని. ఈ ప్రపంచంలో నా దగ్గర ఎక్కువగా డబ్బు ఉంటే, ఆ సొమ్మును మొత్తం నాకు అత్యంత ఇష్టమైన ఆర్ట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తాను. పైగా, చూడటానికి ఎంతో సింపుల్ గా ఉన్నా.. కాస్త నాణ్యమైన ఫర్నీచర్ తో కలల గృహాన్ని అలంకరించుకుంటాను. మంచి సంగీతం లేకుండా జీవించలేను కాబట్టి.. నా కలల గృహంలో తప్పనిసరిగా హై ఎండ్ ఎల్విస్ మ్యూజిక్ బాక్స్ ఉండాల్సిందే. బాల్కనీలో కళ్లు మిరుమిట్లు గొలిపే కొన్ని లైట్లు.. హాయిగా అలా ఊయల ఊగుతూ గడిపేస్తాను.
This website uses cookies.