Categories: LATEST UPDATES

నయా ట్రెండ్.. రబ్లర్ ఫ్లోరింగ్

ఇంటి నిర్మాణంలో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి. ఆధునిక పోకడలకు అనుగుణంగా వైవిధ్య భరితమైన ఇంటీరియర్లు.. ఎక్స్ టీరియర్లు.. ఇలా చాలానే ఉంటాయి. ఇలాంటి కోవలోకి తాజాగా రబ్బర్ ఫ్లోరింగ్ వచ్చి చేరింది. గ్రానైట్, టైల్స్ బదులు రబ్బర్ ఫ్లోరింగ్ తో అది కూడా గదికో రకంగా వైవిధ్యభరితంగా డిజైన్ చేయించుకుంటున్నారు. సాధారణంగా రబ్బర్ ఫ్లోరింగ్ అనేది జిమ్ లు, క్రీడా మైదానాల్లో వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఇళ్లలోని జిమ్స్ తోపాటు పిల్లల గదుల్లో కూడా వీటిని వేయించడానికి మొగ్గ చూపిస్తున్నారు. పై అంతస్తులో నడిచినా.. పిల్లలు ఆడుకున్నా.. కిందకి శబ్దాలు వినిపించకుండా ఉండేందుకు రబ్బర్ ఫ్లోరింగ్ వినియోగిస్తున్నారు. వాస్తవానికి పాత టైల్స్ పైనే కొందరు రబ్బరు ఫ్లోరింగ్ వేయిస్తున్నారు. కానీ అది సరికాదని, కాంక్రీట్ పై వేయిస్తేనే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. రబ్బర్ ఫ్లోరింగ్ దీర్ఘకాలం ఉంటుందని.. సరిగ్గా మెయింటైన్ చేస్తే 20 ఏళ్ల వరకు ఢోకా ఉండదని అంటున్నారు. పైగా నిర్వహణ కూడా సులభమేనని.. రబ్బరు ఫ్లోరింగ్స్ కు ఫంగస్ కూడా పట్టదని వివరిస్తున్నారు. తడిగా ఉండే కిచెన్, బాత్ రూమ్ వంటికి ఇది బాగా అనువుగా ఉంటుంది. రబ్బర్ ఫ్లోరింగ్స్ రకరకాల రంగుల్లో.. విభిన్నమైన శైలుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఖరీదు కాస్త ఎక్కువ. అలాగే కొందరికి ఈ వాసన పడకపోవచ్చు.

This website uses cookies.