Categories: HOME LOANS

పెరుగుతున్న ఇంటి రుణాలు

రూ.19.36 లక్షల కోట్లకు చేరిన హోమ్ లోన్లు

రియల్ ధరలు పెరుగుతున్నా.. బ్యాంకు వడ్డీ రేట్లు పెరుగుతున్నా.. సొంతింటి కల సాకారం చేసుకునే దిశగానే పలువురు అడుగులు వేస్తున్నారు.

పెరుగుతున్న ఇంటి రుణాలు దీనిని ధృవీకరిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఇంటి రుణాలు రూ.19.36 లక్షల కోట్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం పెరుగుదల నమోదైంది. 2022 మార్చి చివరికి హోమ్ లోన్లు రూ.16.84 లక్షల కోట్లు ఉండగా.. 2021 మార్చి చివరికి రూ.14.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక పర్సనల్ లోన్లలోనూ పెరుగుదల కనిపించింది. గత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత రుణాల్లో 20.6 శాతం వృద్ధి నమోదైంది.

This website uses cookies.