Categories: Celebrity Homes

దుబాయ్ లో ఇల్లు కట్టుకుంటా

  • ప్రముఖ మళయాలీ నటి పార్వతీ నాయర్

ప్రముఖ నటి పార్వతీ నాయర్ తన కలల ఇల్లు ఎలా ఉంటుంది? అందులో ఏమేం ఉంటాయ్ వంటి విషయాలను రియల్ ఎస్టేట్ గురుతో ప్రత్యేకంగ పంచుకున్నారు. ఆమెతో మాట్లాడిన కొద్ది సమయంలోనే చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇంటికి సంబంధించి ఆమె ధృక్కోణం చాలా అద్భుతమైనదని అర్థమైంది. ‘నా డ్రీమ్ హోమ్ ఇప్పటికే నిర్మాణంలో ఉంది. అది వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. ప్రాపర్టీపరంగా చూస్తే ఇదే నేను సొంతంగా సంపాదించిన నా మొదటి ఆస్తి. మరి ఈ విషయంలో నా అనుభూతి ఎలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేద కదా? ఇక మాకు ఉన్న ఇళ్లన్నీ మా పూర్వీకులవి. అయితే, నా సొంత ఇల్లు నా డెన్ గా మారబోతోంది. ఈ ఇల్లు కట్టడానికి నాలుగేళ్ల పట్టింది. ప్రత్యేకతలన్నీ డిజైన్ లోనే పొందుపరిచారు’ అని మలయాళీ భామ వివరించారు.

తన కలల ఇల్లు సాకారం కావడాన్ని పార్వతి ఓ ఆశీర్వాదంగా భావించారు. ‘ఒక నటిగా నేను ఇంటికి రావాలనే సుదీర్ఘ కోరిక కలిగి ఉన్నాను. నేను నా మినమిలిస్ట్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతాను. నేను సినిమాలు చేస్తున్నంత సేపూ నా గ్లామర్ నాతో అలానే ఉంటుంది. అయితే, నా ఇంటికి నేను క్లాసీనెస్ జోడించాలనుకుంటున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. అక్కడ ఉన్న ప్రతి వస్తువూ అత్యుత్తమ నాణ్యతతో ఉండాలి. ఇంతకు ముందెన్నడూ చూడనిది అయి ఉండాలి. మీరు మీ ఇంటిని ఆధునీకరిస్తున్నప్పుడు ప్రతి అంశమూ ముఖ్యమే’ అని పార్వతి వివరించారు.

parvati nair

ఓ ఇంటిని లాభదాయకంగా నిర్మించడం నిజంగా సవాల్ తో కూడుకున్న వ్యవహారమని ఆమె పేర్కొన్నారు. తన దగ్గర బోలెడు డబ్బు ఉంటే ఐల్యాండ్ లో ఏదైనా తీసుకుంటానని చెప్పారు. ఏదైనా ద్వీపంలో బంగ్లా కొనుగోలు చేస్తానన్నారు. నీటిపై ఉండే బంగ్లాలు తన ఊహల్లో లేవని చెప్పారు. ఇసుక బీచ్ ఏదో ఒక రోజు తన కలల వసతిని నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘నేను కాలంతో పాటు మారాను. ముఖ్యంగా రంగులు విషయంలో చాలా ప్రత్యేకంగా ఉంటాను. డబ్బు అనేది ఇప్పుడు సమస్య కాదు. నా కొత్త ఇంటికి ఏమేం కావాలో లిస్ట్ రాయడం చాలా సరదాగా ఉంది.

కళ, ధ్యానానికి అంకితమైన వ్యక్తిగత స్థలం కలిగి ఉండటాన్ని ఇష్టపడతాను. కళాత్మకం అనేది నాకు చాలా ఇష్టమైన అంశం’ అని వివరించారు. ‘నేను దుబాయ్ లో బాగా తిరిగాను. నా కలల ఇంటిని ఎప్పుడో ఒకప్పుడు అక్కడ కట్టుకుంటాను. వలస వెళ్లడం నాకు చాలా ఇష్టం. కానీ ప్రస్తుతం నా సౌందర్యంపైనే దృష్టి పెట్టాను. తమ పూర్వీకుల ఇళ్లను, వారి మూలాలను సజీవంగా ఉంచే సెలబ్రిటీల ఇళ్లంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పి పార్వతీ నాయర్ తన సంభాషణ ముగించారు.

This website uses cookies.