రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రుణాలిచ్చే విషయంలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్, నాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రుణాలిచ్చే విషయంలో డ్రాఫ్ట్ హార్మనైజ్డ్ ప్రుడెన్షియల్ ఫ్రేమ్ వర్క్ ని విడుదల చేసింది. కన్సార్టియం ఏర్పాట్ల కింద నిధులు సమకూర్చే విషయంలో రుణదాతల మొత్తం రూ.1500 కోట్ల వరకు ఉంటుందని.. అందులో వ్యక్తిగత రుణదాత మొత్తం 10 శాతం కంటే తక్కువ ఉండకూడదని స్పష్టం చేసింది.
రుణదాతల మొత్తం ఎక్స్ పోజర్ రూ.1500 కోట్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాజెక్టుల్లో.. వ్యక్తిగత రుణదాత ఎక్స్ పోజర్ 5 శాతం లేదా రూ.150 కోట్లు ఏది ఎక్కువైతే అది ఉండాలని పేర్కొంది. ఈ నిబంధనలన్నీ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకులు, ఆలిండియా ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్లకు వర్తిస్తాయని వెల్లడించింది. అలాగే రుణదాతలు ఆర్థిక సహాయం చేసే ఏ ప్రాజెక్టుకైనా సానుకూల ప్రస్తుత నికర విలువ (ఎన్ పీఏ) తప్పనిసరి అని స్పష్టం చేసింది. రుణదాతులు ప్రాజెక్టు ఎన్ పీవీని ప్రతి సంవత్సరం స్వతంత్రంగా మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.
This website uses cookies.