Categories: LATEST UPDATES

బడా ప్రాజెక్టుల్లోనే రీసైకిల్ ప్లాంట్? ఆహ్వానించిన క్రెడాయ్

హైదరాబాద్లో బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. మరి, ఇందులో నుంచి వెలువడే నిర్మాణ వ్యర్థాల్ని ఎక్కడ పారవేస్తున్నారు? నిర్మాణ సంస్థలు ఎక్కడో ఒక చోట పారవేసి చేతులు దులిపేస్తున్నారా? కానీ, ఆ నగరంలో మాత్రం డెవలపర్లు ఇలా వ్యవహరించట్లేదు. ఇందుకు అక్కడి స్థానిక సంస్థల సహకారంతో చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నారు.

ప్రతి రోజు 20 టన్నులు లేదా అంతకుమించి నిర్మాణ వ్యర్థాల్ని ఉత్పత్తి చేసే నిర్మాణ ప్రాజెక్టుల్లో తప్పనిసరిగా రీసైక్లింగ్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలన్న స్థానిక సంస్థ నిర్ణయాన్ని క్రెడాయ్ సంఘం ఆహ్వానించడంతో పాటు అమలు చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. దీని వల్ల నిర్మాణ వ్యర్థాల్ని నిర్మాణంలోని ఇతర పనుల నిమిత్తం కంకరగా వాడుకునే అవకాశం ఉంటుంది. నిర్మాణ స్థలాల్ని పర్యావరణ అనుకూలంగా మార్చివేసే ఈ నిర్ణయం వల్ల పలు ప్రయోజనాలున్నాయి. ముందుగా సైటులో వ్యర్థాల రికవరీ ప్లాంటును ఏర్పాటు చేస్తారు. దీంతో వ్యర్థాల ఉత్పత్తి అనేది జరగదు.

నిర్మాణ వ్యర్థాల్లో హెడ్ బ్రేక్ కాంక్రీట్ బ్లాకుల పైల్స్ క్యాప్లు మరియు మరోసారి ఉపయోగించడానికి వీల్లేని టైళ్లు వంటివి ఉంటాయి. వీటిని పారవేయడానికి బదులుగా, వాహనాలు వెళ్లే మార్గంలో వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి వ్యర్థాల్ని నిర్మాణ స్థలాల్ని నుంచి సేకరించినా ఎక్కడో ఒక చోట పారవేయాల్సిందే. అందుకు బదులు, ఆయా నిర్మాణాల్లోనే వాడుకుంటే ఉత్తమం అని స్థానిక సంస్థ అభిప్రాయపడుతోంది. ఇందుకు సంబంధించి కేఎంసీ ఒక ప్రయోగం చేపట్టింది. ప్రతిరోజు 500 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తయ్యే ప్రాజెక్టులో వ్యర్థాల్ని సేకరించే ప్లాంటును ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాణ వ్యర్థాల్ని కంకరగా మార్చివేసి రహదారుల్లో ఉపయోగిస్తారు. ఇందుకోసం రూ.55 కోట్లు ఖర్చు అయ్యింది. దీన్ని ఓ ప్రైవేటు సంస్థకు పదేళ్ల పాటు అప్పగిస్తారు. ఇదే విధంగా మరో ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీని వల్ల ఎక్కడ పడితే అక్కడ భూమిలో పారవేసే అవకాశం ఉండదు. పైగా, వ్యర్థాల నుంచి సంపదను తిరిగి పొందేందుకు సహాయ పడుతుందని క్రెడాయ్ బెంగాల్ ఛైర్మన్ నందు బెలానీ తెలిపారు.

‘‘వాస్తవానికి, నిర్మాణంలో ఉపయోగించే అనేక వస్తువుల్ని రీసైకిల్ చేయవచ్చు. కాంక్రీటును కంకరగా మార్చొచ్చు. అంతెందుకు.. కలప, ఉక్కు, రాగి, ఇత్తడి వంటివి మళ్లీ వాడుకోవచ్చు. కాకపోతే, వాటిని పునరుత్పత్తి చేయాలనే ఆలోచనలుండాలి. కాస్త ఖర్చు పెట్టి ప్రత్యేకంగా ప్లాంటును ఏర్పాటు చేయాలి.’’

This website uses cookies.