Categories: LATEST UPDATES

రెరా గడువు ఆరు నెలలు పొడిగింపు

కరోనా సెకండ్ వేవ్ నిర్మాణ రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఇప్పటికే అధిక శాతం భవన నిర్మాణ కార్మికులు స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెరాలో 2021 మార్చి 15న గడువు ముగిసే ప్రాజెక్టుల తుది గడువును ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే, ఈ ప్రాజెక్టుల తుది గడువు సెప్టెంబరుతో ముగిసిపోతుంది. గడువును పొడిగించినందుకు ప్రమోటర్లు ఎలాంటి రుసుమును రెరా అథారిటికి చెల్లించక్కర్లేదు. మార్చి 15 లేదా ఆ తర్వాత గడువును రివైజ్ చేసుకోవాల్సిన ప్రాజెక్టుల గడువును రెరా సభ్య కార్యదర్శి కె.విద్యాధర్ ఆరు నెలలు గడువును పెంచారు.

This website uses cookies.