ఇంధనాన్ని పొదుపు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ఎకో నివాస్ సంహిత పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద 28.3 లక్షల ఇళ్లు నిర్మించనున్నారు. ఇండో-స్విస్ భాగస్వామ్యంలో ఈ పథకం అమలు కానుంది. దీనికి సంబంధించిన వివరాలను హౌసింగ్ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వివరించారు. లబ్ధిదారుల అంగీకారంతో ఇంటి నిర్మాణంలో ఇంధన పొదుపు డిజైన్లు అమలు చేస్తామని తెలిపారు. ‘ఇది పూర్తిగా స్వచ్ఛంద పథకం. ప్రస్తుతం నివాస గృహాలే అధిక విద్యుత్ వినియోగిస్తున్నాయి. దేశంలో మొత్తం విద్యుదుత్పత్తిలో 38 శాతం నివాస గృహాలకే సరిపోతోంది. ఏపీ విషయానికొస్తే ఇది 28 శాతం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రతిపాదిత పథకం ఇంటి లోపల ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గిస్తుంది. తద్వారా విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది’ అని వివరించారు. పీఎంఈవై-నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు అనే పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.28వేల కోట్ల వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు. ఇప్పటికే 10.7 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని వివరించారు.
This website uses cookies.