ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ముంబై అంధేరీ ప్రాంతంలో రెండు ఆఫీసులను కొనుగోలు చేశారు. మొత్తం 5,547 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు ఆఫీసు స్థలాలకు రూ.11.37 కోట్ల చెల్లించారు.
అంధేరీ వెస్ట్ లోని వీరా దేశాయ్ రోడ్డులోని ఓ రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సోనూ వీటిని కొనుగోలు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 2,767 చదరపు అడుగులు, ఫస్ట్ ఫ్లోర్ లో 2,780 చదరపు అడుగుల స్థలాన్ని ఆయన సొంతం చేసుకున్నారు.