భారత స్టార్టప్ ఎకో సిస్టమ్ లో ఆవిష్కరణ, వృద్ధి, జ్ఞానమార్పిడిని ప్రోత్సహించడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ బెర్కాడియాతో టీ-హబ్ జట్టు కట్టింది. రెండేళ్లపాటు ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది. ఇప్పటి నుంచి టీ హబ్ సభ్యత్వ కార్యక్రమంలో బెర్కాడియా చురుకుగా పాల్గొంటుంది. ‘ఈ భాగస్వామ్యం ద్వారా మా స్టార్టప్ లను బెర్కాడియా నెట్ వర్క్, వనరులతో అనుసంధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. ఒప్పందంలో భాగంగా కనీసం 40 నుంచి 56 స్టార్టప్ లను బెర్కాడియాతో అనుసంధానించాలని టీ హబ్ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బెర్కాడియా ఇండియా హెడ్, ఎండీ సుదిప్తో ముఖర్జీ పాల్గొన్నారు.
This website uses cookies.