కొన్ని సందర్భాల్లో.. ఒక ఇంటిని కలల గృహంగా ఎలా మార్చుకోవాలనే విషయాన్ని పక్కాగా నిర్వచించలేం. కాకపోతే, అన్నివిధాలుగా నచ్చే ఇల్లు ఎలా ఉండాలనే విషయంలో మాత్రం కచ్చితంగా చాలామందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ఈ క్రమంలో తారా సుఠారియాకు మంచి అవగాహన ఉంది. ఇల్లు ఎప్పుడూ ఒకేరకంగా ఉండటం ఆమెకు ఇష్టం లేదు. అందుకే, తన కలల గృహాన్ని సరైన రీతిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో ఆమె కలల గృహం ఎలా ఉండాలని కోరుకుంటోందని రియల్ ఎస్టేట్ గురు ప్రశ్నించింది. ఎక్కడ కొనుక్కోవాలని భావిస్తోంది? ఇల్లు పెద్దగా ఉండాలా? లేక చిన్నదా?
బాలీవుడ్ నటి తారా సుఠారియా ప్రస్తుతం ఉన్న సొంత ఇల్లు చూస్తే ఎవరికైనా మంచి ప్రేరణ కలుగుతుంది. “నేను నా ఇంటిలో అసమానమైన శైలిని మరియు ఆ సొగసును కలిగి ఉండాలని భావిస్తున్నాను. ఇప్పటికే తల్లి దండ్రులు హిమాన్షు మరియు టీనా సుతారియా, సోదరి పియా సుతారియా మరియు మా ఆరాధ్య బీగల్ బెయిలీతో కలిసి బాంద్రాలో విశాలమైన అపార్ట్‌మెంట్లో ఉంటున్నాను. పూర్తిగా తెల్లటి రంగు ప్యాలెట్, రెండు బాల్కనీలు మరియు అందమైన మూలలు నా ఇంటిని హైలైట్ చేస్తాయి.”
ఆమె బాల్కనీని చూస్తే ముచ్చటేస్తోంది. తెలుపు మరియు నీలం రంగు సిరామిక్ కుండీల్లో ఆహ్లాదం పంచే మొక్కల్ని పెంచింది. పైగా, ఆయా బాల్కనీ ప్రాంతాన్ని పూర్తిగా వుడెన్ ఫ్లోరింగ్ చేశారు. అక్కడ కూర్చుంటే ముంబై నగరాన్ని ఎంచక్కా చూడొచ్చు. ఔట్ డోర్ కార్నర్‌లో యోగా సెషన్‌లో పాల్గొనవచ్చు. సూర్యకాంతిని ఆస్వాదించొచ్చు. అక్కడే తను రోజు వేసుకునే రకరకాల డ్రెస్సుల్లో సెల్ఫీలు, ఫోటోలను తీసుకుంటుంది. లివింగ్ రూము తెలుపు, క్రీమ్ రంగుల్ని కలిసి ఉంటుంది. ఇంట్లోని మూలలు ఎంతో చూడక్కగా ముస్తాబు చేసి ఉన్నాయి. ఆమె డైనింగ్ రూము ఎంతో అందంగా తీర్చిదిద్దారు. తమ ఇద్దరికీ నచ్చే విధంగా మొత్తం ఇంటిని డిజైన్ చేశారు. ఇంట్లోని ప్రతి అంగుళాన్ని చూడచక్కగా, ఎంతో అందంగా కనిపిస్తోంది. “నా ఇంట్లో తెలుపు రంగును ఇష్టపడతాను. పెద్ద కిటికీలు ఇంటి ఆకర్షణను పెంచుతాయి, లోపల పుష్కలంగా సహజ కాంతి వస్తుంది. నా గదిలో మెరిసిపోవడానికి మరియు మెరుగ్గా కనిపించేలా లైటింగ్‌తో కూడిన వానిటీ మిర్రర్ కూడా ఉందని ఆమె వివరించారు.
This website uses cookies.