రియల్ ఎస్టేట్ గురుతో
జనప్రియ సీఎండీ కె. రవీందర్ రెడ్డి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అందుబాటు ధరల ఇళ్లను ప్రోత్సహించాలని జనప్రియ ఇంజనీర్స్ సీఎండీ రవీందర్ రెడ్డి కోరారు. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు తమ పరిధి మేరకు మద్దతిచ్చాయని, ఇది ఇలాగే కొనసాగితే చాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అంశాలపై ఆయన ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘రియల్ ఎస్టేట్ రంగనికి ప్రతి ప్రభుత్వమూ సపోర్ట్ చేసింది. తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్.. ఇలా అన్ని ప్రభుత్వాలూ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించాయి. అప్పటి పరిస్థితులు, పరిధిల మేరకు సపోర్ట్ చేశాయి. అది ఇలా కొనసాగితే చాలు. నా ఉద్దేశంలో రియల్ ఎస్టేట్ అనేది స్వల్పకాలిక అంశం కాదు. ఇది దీర్ఘకాలిక వ్యవహారం. ఇప్పటివరకు ఎలా ఉందో అదే కొనసాగితే సరిపోతుంది. అయితే, ప్రభుత్వానికి నేను చేసే విజ్ఝప్తి ఒకటే.. అందుబాటు ధరల గృహాలపై దృష్టి పెట్టాలి. వీటిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా దిగుమ మధ్యతరగతి ప్రజలు తక్కువ వ్యయంతో సొంతింటి కల నెరవేర్చుకునేలా ఏదైనా పథకం తీసుకురావాలి. ఇది వారికి చాలా ఊతమిస్తుంది. ఇక గత పదేళ్లలో రియల్ ఎస్టేట్ లో సమస్యలు ఉన్నాయని చెప్పడం సరికాదు. మాకు ఉన్న ఒకే ఒక్క సమస్య ఏంటంటే.. ప్రాజెక్టులో 10 శాతం ఏరియాను మోర్టిగేజ్ చేసుకుంటున్నారు. దాని రిలీజ్ లో మాకు సమస్యలు వస్తున్నాయి. రెరా వచ్చిన తర్వాత కూడా దీనిని తీయలేదు. హైదరాబాద్ లో రెసిడెన్షియల్ కు సమస్య లేదు. సంవత్సరం మారినంత మాత్రాన రియల్ ఎస్టేట్ పైకి, కిందకు మారిపోదు. పెద్దగా మారిపోదు.. అలా అని తగ్గిపోదు. అయితే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు రెండు మూడు నెలలు వేచి చూస్తారు. అయితే, దీని ఆధారంగా ఏదో జరిగిపోతుందనే ఆందోళన అవసరం లేదు. అంతా సజావుగానే సాగుతుంది’ అని చెప్పారు
This website uses cookies.