Categories: CONSTRUCTION

Construction Tips : వాటర్ ప్రూఫ్ ట్రీట్ మెంట్ ఇలా

మీరెంతో కష్టపడి దాచుకున్న సొమ్ముతో.. మీకు నచ్చిన ఇల్లు కట్టుకుంటున్నారా? అయితే.. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక వాటర్ లీకేజీ కాకుండా ఉండాలంటే మీరు రూఫ్ శ్లాబులకు వాటర్ ప్రూఫ్ ట్రీట్ మెంట్ (Construction Tips) పక్కాగా చేయించాలి.

  • శ్లాబు కింది భాగంలో మూడు అంగుళాలు లేదా నాలుగు అంగుళాల మందంలో.. సుమారు నాలుగు రోజుల పాటు ఏదైనా లీకేజీ ఉందేమో గమనించండి. లేదా ఎక్కడైనా తడి ఉందేమో పరిశీలించండి. లీకేజీ ఉంటే గనక శ్లాబు ఉపరితలాన్ని కాంక్రీటు కనిపించేంత వరకూ వైర్ బ్రష్ తో గరుకుగా చేసి, గాలి వాటర్ జెట్ తో శుభ్రపర్చాలి.
  • మోర్టారును కలపడానికి సరైన బాక్సులను షీట్లను వాడాలి. వాటర్ ప్రూఫింగ్ చేసే ముందు పైపుల్ని అమర్చాలి. నీరు నిలవకుండా ఉండేందుకు సరైన రీతిలో వాలుగా ఉండేలా చూడాలి.
  • సిమెంట్ స్లరీ కోట్ ఎండిపోక ముందే.. 20 మిల్లీమీటర్ల మందం గల వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్ని వేయాలి.
  • సిమెంట్ స్లరీని 1:3 నిష్పత్తిలో వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్తో కలిపి లీకేజీ ఉన్న ప్రాంతంలో వేయాలి.

పునాదులు ఇలా తవ్వాలి..

  • పునాదులు తవ్వే ముందు సరైన రీతిలో మార్కింగ్ చేసుకోవాలి. అన్నివైపులా కొలతలు సరిగ్గా చూసుకోవాలి.
  • పునాది కోసం తవ్విన గుంతలోని అంతర్గత భాగాన అన్నివైపులా ఆరు అంగుళాల గ్యాప్ ఉండేలా జాగ్రత్తపడాలి. పునాదులు, పీసీసీ బెడ్ వంటివి వేయడానికి సులువుగా ఉండేలా గుంతల్ని తవ్వాలి.
  • తవ్వకం ద్వారా తీసిన మట్టిన గుంతలకు రెండు మీటర్ల దూరంలో అమర్చాలి. అదే మట్టితో మళ్లీ పునాదిని నింపాల్సిన అవసరముంటే అక్కడే ఒక పద్ధతి ప్రకారం వేసుకోవాలి.
  • వేడి వాతావరణంలో వదులుగా, ఇసుక తరహాలో ఉండే మట్టిని వాలుగా ఉండేలా, మట్టి మొత్తం వెళ్లిపోయే విధంగా ఉండకూడదు.
  • పునాదులు తవ్వేటప్పుడు.. గుంతలోని అడుగు భాగమంతా ఒక స్థాయిలో, ఒక లైను ప్రకారం ఉండాలి.
  • జారుడు నేల స్వభావమున్న చోట పునాది తవ్వేటప్పుడు లెవెల్ బెంచీలు ఉండేలా జాగ్రత్తపడాలి. ఒక బెంచీకి మరో బెంచీకి మధ్య గల తేడా పునాది రాయి కంటే ఎక్కువ ఉండకూడదు.
  • పునాది గుంతల్ని తవ్విన తర్వాత నిపుణుల్ని సంప్రదించి రాతపూర్వకమైన అనుమతి తీసుకోవాలి. పీసీసీ బెడ్ ను వేసే ముందు గుంత లోతును, సామర్థ్యాన్ని తెలుసుకోవాలి.
  • ఒకవేళ నిర్ణీత స్థాయి కంటే ఎక్కువ లోతులో పునాదిని తవ్వితే.. ఆయా లోతును మళ్లీ మట్టితో పూడ్చకూడదని గుర్తుంచుకోండి. నిపుణుల్నిసంప్రదించి వారి సలహా మేరకు సిమెంట్ కాంక్రీటుతో మాత్రమే పూడ్చి వేయాలి.
  • పునాదుల్లో కాంక్రీటును వేశాక.. 12 అంగుళాల మేరకు మట్టి లేయర్లను వేయాలి.
నిర్మాణాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా.. సమస్యలున్నా.. మాకు రాయండి. మీకు ఎన్ ఏ సీ నిపుణులు సమాధానాలిస్తారు. మీ ప్రశ్నల్ని regpaper21@gmail.comకి మెయిల్ చేయండి.

This website uses cookies.