Categories: LATEST UPDATES

ఎస్బీడీలో రెండొంతుల రీటబుల్ స్టాక్

దేశంలో ఉన్న రీటబుల్ గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ లో మూడింట రెండొంతులు మొదటి ఆరు ప్రధాన నగరాల్లోని సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ట్(ఎస్ బీడీ)ల్లోనే ఉంది. ఇందులో హైదరాబాద్ అత్యధికంగా 28 శాతం వాటా కలిగి ఉండటం విశేషం. తర్వాత 24 శాతంతో బెంగళూరు ఉంది. ఎస్ బీడీల్లోని 60 శాతం గ్రేడ్ ఏ స్పేస్ రీట్ కు అనుకూలమైనది. అదే సమయంలో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో పెరిఫెరల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (పీబీడీ)లలో మొత్తం గ్రేడ్ ఏ ఆఫీస్ స్టాక్ లో సగం మేర రీట్ అనుకూలమైనది కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కు చక్కన ప్రత్యామ్నాయంగా మరిన రీట్ లు గణనీయయమైన మార్కెట్ పొందుతున్నట్టు కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం 667.2 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్టాక్ ఉండగా.. 74.4 మిలియన్ చదరపు అడుగుల రీట్ స్టాక్ ఉంది. ఇంకా 379.5 చదరపు అడుగుల రీటబుల్ ఆఫీస్ స్టాక్ ఉండగా.. 41 మిలియన్ చదరపు అడుగుల రీటబుల్ స్టాక్ నిర్మాణంలో ఉంది. ప్రస్తుతం ఆఫీస్ సెక్టార్.. టెక్నాలజీ, ఫ్లెక్స్ స్పేస్ తో ఆశాజనకంగానే ఉంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ‘ఇతర ప్రాంతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో రీట్ లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అమెరికా, సింగపూర్, ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ రీట్ లు మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం కంటే తక్కువ.

భారతీయ ఆఫీస్ మార్కెట్ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎక్కువ సంఖ్యలో రీట్ ల విస్తరణకు భారీ సంభావ్యత ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఇండస్ట్రియల్, డేటా సెంటర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, ఎడ్యుకేష్ వంటి ఇతర అసెట్ క్లాస్ లకు రీట్ లు విస్తరించే అవకాశం ఉంది’ కొలియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సర్వీసెస్ ఎండీ పీయుష్ గుప్తా అన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ లో దాదాపు 380 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం రీట్ లుగా చేయడానికి అర్హత కలిగి ఉంది. బెంగళూరులో 25 శాతం రీటబుల్ స్టాక్ ఉండగా.. హైదరాబాద్ 19 శాతంతో ఉంది.

This website uses cookies.