Categories: TOP STORIES

రియల్ పై ఏఐ ప్రభావం ఎంత?

  • రియల్ పరిశ్రమలోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ
  • చాలా పనులు కృత్రిమ మేధతోనే పూర్తి

ప్రస్తుతం ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించే చర్చ జరుగుతోంది. విభిన్న రంగాల్లో ఇది పరివర్తన శక్తిగా మారింది. రియల్ రంగంలోనూ ఇది స్పష్టమైన ప్రభావం చూపిస్తోంది. దీని ప్రభావం చాలా చోట్ల స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాపర్టీ వాల్యుయేషన్ నుంచి కస్టమర్ సర్వీస్ వరకు పలు టాస్కులను ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో రియల్ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉందో చూద్దామా?

ఏఐ ఆధారిత ప్రాపర్టీ వాల్యుయేషన్..

ఆస్తి మదింపు, మార్కెట్ విశ్లేషణలో ఏఐ గణనీయమైన ప్రభావం చూపుతోంది. సంప్రదాయ ఆస్తి మదింపు పద్ధతులు కాస్త సమయం తీసుకుంటాయి. పైగా మాన్యువల్ ఇన్ పుట్స్ పై ఆధారపడతాయి. అంతేకాకుండా లోపాలకు కూడా అవకాశం ఉంటుంది. అయితే, కృత్రిమ మేధ ద్వారా అధునాతన అల్గారిథమ్, మెషీన్ లెర్నింగ్ ఉపయోగించి అధిక మొత్తంలో డేటాను త్వరగా, కచ్చితంగా విశ్లేషించే అవకాశం ఉంది. ఈ సమాచారం త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. పైగా లోపాలకు అవకాశం చాలా తక్కువ.

చాట్ బాట్ లో కస్టమర్ సేవలు..

ప్రస్తుతం వినియోగదారుల సేవకు చాట్ బాట్ లు కీలంగా మారాయి. వాటి ప్రాబల్యం క్రమంగా పెరుగుతోంది. కొనుగోలుదారుల సందేహాలను తక్షణమే తీరుస్తున్నాయి. ఆస్తి రకం ఏమిటి? ఫైనాన్సింగ్ ఎంపికలు ఏమైనా ఉన్నాయా? ధర ఎలా ఉంది తదితర అంశాల గురించి కొనుగోలుదారులు ఆరా తీస్తే.. తక్షణమే సంబంధిత సమాచారాన్ని అందిస్తున్నాయి. ప్రాపర్టీ విజిట్ షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నాయి.

పెట్టుబడి నిర్ణయాలకు ప్రిడెక్టివ్ అనలిటిక్స్..

ఏఐ అల్గారిథమ్స్ ద్వారా ఆధారితమైన ప్రిడెక్టివ్ అనలిటిక్స్.. భవిష్యత్ పరిణామాలను అంచనా వేయడానికి చారిత్రక డేటా, మార్కెట్ ట్రెండ్ లను విశ్లేషిస్తుంది. అభివృద్ధి చెందుతున్న ట్రెండ్లను గుర్తించడం, ఆస్తి విలువ మార్పులను అంచనా వేయడం, వారి పెట్టుబడి పోర్టిఫోలియోలను ఆప్టిమైజ్ చేయడం వంటి వాటి కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రాపర్టీ మేనేజ్ మెంట్ ని క్రమబద్ధీకరించడం..

ప్రాపర్టీ నిర్వహణ అనేది మెయింటనెన్స్, అద్దెదారుతో సంబంధాలు, ఆర్థిక నిర్వహణ వంటి వివిధ అంశాలను పర్యవేక్షించే బహుముఖ విధి. రొటీన్ టాస్కులను ఆటోమేట్ చేయడం ద్వారా సమర్థవంతమైన నిర్ణయాధికారం కోసం విలువైన అంశాలను అందిస్తూ.. ఏఐ ఈ ప్రక్రియలను క్రమబద్ధీకరిస్తోంది. ఏఐ ఆధారిత ప్రాపర్టీ మేనేజ్ మెంట్ వ్యవస్థలు మెయింటనెన్స్ అవసరాలను అంచనా వేస్తాయి. ఉహించని మరమ్మతుల సంభావ్యతను తగ్గిస్తాయి. ఆస్తి యజమానుల సమయాన్ని ఆదా చేస్తాయి. అంతే కాకుండా ఏఐ ద్వారా ఆర్థిక నిర్వహణ సరళీకృతం అవుతుంది. నగదు ప్రవాహాన్ని విశ్లేషిస్తుంది. భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసి, బడ్జెట్ వ్యూహాలను అనుకూలంగా మారుస్తుంది.

వ్యక్తిగతీకరించిన మార్కెట్ వ్యూహాలు..

రియల్ ఎస్టేట్ రంగానికి మార్కెటింగ్ అనేది మూలస్తంభం. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ.. మార్కెటింగ్ వ్యూహాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తోంది. వ్యక్తిగతీకరించిన మార్కెటింగ్ ప్రచారాలను రూపొందించడానికి ఏఐ అల్గారిథమ్స్ వినియోగదారుల ప్రవర్తన, ప్రాధాన్యతలు, మార్కెట్ ట్రెండ్లు విశ్లేషిస్తాయి. ఆ మేరకు వారిని ఏఐ మార్కెటింగ్ చేరుకునేలా చేస్తుంది.

మెరుగైన భద్రత.. మోసాల నివారణ

రియల్ ఎస్టేట్ లావాదేవీలలో భద్రత అనేది చాలా ముఖ్యమైన అంశం. భద్రతా చర్యలను గణనీయంగా పెంచడానికి ఏఐ సిద్ధంగా ఉంది. అధునాతన ఏఐ అల్గారిథమ్స్ అసాధారణ లావాదేవీల నమూనాలను గుర్తిస్తాయి. మోసపూరిత కార్యకలాపాలను కూడా గుర్తించగలవు. రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థిక లావాదేవీలకు అదనపు భద్రతను అందిస్తాయి.

This website uses cookies.