- రూ.18,616 కోట్లు రావొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా
వచ్చే ఏడాది మనదేశ రియాల్టీ రంగంలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయని నైట్ ఫ్రాంక్ అనే పరిశోధన సంస్థ అంచనా వేసింది. 2022లో భారత రియాల్టీ రంగంలో సీమాంతర పెట్టుబడులు 250 కోట్ల డాలర్ల (దాదాపు రూ.18,616 కోట్లు)కు చేరుకుంటాయని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణలు మనదేశ రియల్ రంగానికి ఎంతో ఊపునిచ్చాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశ రియల్ రంగంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడింది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ఇక 2022లో రియల్ రంగంలో సీమాంతర పెట్టుబడులు పెట్టడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సరైన దేశాలని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.