విజయ్ దేవరకొండ.. చాలామందికి అభిమాన నటుడు. తన తెలివి, ఆకర్షణతో ప్రేక్షకుల మది దోచుకోవడంలో ఎలాంటి అవకాశాన్నీ ఆయన వదిలిపెట్టరు. విజయ్ కెరీర్ లో అటు హిట్స్, ఇటు ఫ్లాప్స్ ఉన్నప్పటికీ.. సినీ ప్రేక్షకుల్లో ఆయన అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ కల్కి 2898 ఏడీ సినిమాలో నటించారు. ప్రేక్షకులు ఊహించని విధంగా ఆయన తన లుక్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. రౌడీ బాయ్ అని ముద్దుగా పిలుచుకునే విజయ్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో తన కలల సౌధాన్ని నిర్మించుకున్నారు. తన ఖరీదైన, ఆధునికమైన ఇంటిని తన ఫ్యాన్స్ చూసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతుంటారు. మరి సోషల్ మీడియాలో ఆయన తన ఇంటి గురించి ఏం పంచుకున్నారో చూద్దామా?
విజయ్ దేవరకొండ ఇంట్లోకి వెళ్లడం అనేది ఓ విచిత్రమైన పేషియో ద్వారా ప్రారంభమవుతుంది. లోపల ఉన్న అద్భుతమైన ఇంటీరియర్ కు అది ఆహ్వానం పలుకుతున్నట్టు ఉంటుంది. లివింగ్ రూమ్ చూస్తే చాలు.. చూపు తిప్పుకోలేం. విశాలమైన ఫ్రెంచ్ కిటికీల నుంచి లోపలకు ధారాళంగా వచ్చే సహజమైన కాంతి మైమరిపిస్తుంది. ఇంకా సమకాలీన కళాఖండాలు, కాలాతీత వస్తువుల సమ్మేళనంతో ఆ గదిని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఇక చక్కని కళాఖండలతో అలంకరించి ఉన్న గోడపై ఓ అద్భుతమైన దృశ్యం చూపు తిప్పుకోనివ్వదు.
అదే విజయ్ ను దిగ్గజ హీరోగా నిలబెట్టిన అర్జున్ రెడ్డి పెయింటింగ్. ఆ గదిలోని మినిమలిస్టిక్ డెకర్.. విజయ్ వ్యక్తిగత అభిరుచులను ప్రతిఫలింజేస్తుంది. ఇక విజయ్ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి రూపొందించిన కార్నర్ లివింగ్ స్పేస్ ను మంచి ఉంటుంది. టెర్రస్ బాల్కనీలో ఖరీదైన లాంజర్లు అద్భుతంగా కనిపిస్తాయి. రోజువారీ ఉరుకులు, పరుగుల జీవితం నుంచి తప్పించుకుని అక్కడ నుంచి నగర అందాలను ఆస్వాదించేలా ఆ ప్రదేశాన్ని తీర్చిదిద్దారు.
ఇక విజయ్ దేవరకొండ ఇంటి నడిబొడ్డున మల్టీ ఫంక్షనల్ బార్ ఉంది. ఎంతో స్టైల్ గా దాన్ని రూపొందించారు. ఆధునిక లుక్ తో సమకాలీన సౌందర్యంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అక్కడ గడిపేలా ఆ ప్రదేశాన్ని డిజైన్ చేశారు. ఆధునిక మినిమలిజం పట్ల విజయ్ కు ఉన్న మక్కువ ఆ ఇంట్లో ప్రతిఫలిస్తుంది. క్లీన్ లైన్లు, చిందరవందర లేని ఖాళీ ప్రదేశాలు, మ్యూటెడ్ రంగులు ఆహ్లాదపరుస్తాయి. సొగసైన డెకర్ నుంచి ఆలోచనాత్మక టెక్చర్ వరకు ప్రతి మూలా సౌందర్య కళ ఉట్టిపడుతుంది. విజయ్ దేవరకొండ ఇల్లు ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా మాత్రమే కాదు.. సుడిగాలి మధ్య ప్రశాంతత యొక్క ఒయాసిస్సులా కనిపిస్తుంది.
విజయ్ దేవరకొండ ఇంటిని ఆమూలాగ్రం పరిశీలిస్తే.. వాస్తు అద్భుతం కంటే ఆయన ప్రయాణం, ఆయన అభిరుచులు, కళలు, సౌలభ్యం పట్ల ఆయన అచంచలమైన అంకితభావం వంటి ఎన్నో అంశాలు కనిపిస్తాయి. కళ, శైలి, ప్రశాంతత కలబోసిన పరిపూర్ణమైన స్వర్గధామమే విజయ్ ఇల్లు అనడంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు. విజయ్ కెరీర్, వ్యక్తిగత జీవితం అభివృద్ధిపథంలో పయనిస్తున్న తరుణలో ఆయన అందమైన ప్రయాణానికి ఆ ఇల్లు నిదర్శనంగా నిలుస్తుంది. ఆధునిక గాంభీర్యం, కాలాతీత ఆకర్షణ వంటి అంశాలు ఆ ఇంట్లోని మూలమూలనా ఉంటాయి.
This website uses cookies.