సిమెంట్ పుట్టీ, టెక్చర్స్, ప్రైమర్స్, ఎమల్సన్స్ ఉత్పత్తి కోసం అదనంగా మూడు ఫ్యాక్టరీలను నిర్మించాలని టెక్నో పెయింట్స్ నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, చిత్తూరుతోపాటు మధ్యప్రదేశ్ లోని కట్నిలో వీటిని నిర్మించనున్నట్టు వెల్లడించింది. కొత్త ప్లాంట్ల కోసం రూ.46 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది.
ప్రతి ఫ్యాక్టరీ ప్రారంభ దశలో 30వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం టెక్నో పెయింట్స్ కు తెలంగాణలో మూడు, ఏపీలో ఒక ఫ్యాక్టరీ ఉన్నాయి. వీటి వార్షిక సామర్థ్యం 2.50 లక్షల మెట్రిక్ టన్నులు. దేశంలోని పెయింటింగ్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో దేశమంతా తమ రిటైల్ నెట్ వర్క్ పెంచాలని టెక్నో పెయింటింగ్స్ నిర్ణయం తీసుకుని ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మూడు కొత్త ఫ్యాక్టరీల ఏర్పాటుకు సిద్ధమైంది.
This website uses cookies.