రియల్ పరిశ్రమ కోసం డిజిటల్ ట్విన్ అండ్ ఇంటరాక్టివ్ త్రీడీ సొల్యూషన్లను అభివృద్ధి చేయడానికి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రియల్ టైమ్ త్రీడీ టూల్ అయిన అన్ రియల్ ఇంజిన్ అధీకృత భాగస్వామిగా స్క్వేర్ యార్డ్స్ త్రీడీ విజువలైజేషన్ విభాగం ప్రాప్ వీఆర్ వ్యవహరించనుంది. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ విక్రయాల్లో ఓ కొత్త ఒరవడి సృష్టించడానికి ఈ భాగస్వామ్యం సహాయపడనుంది.
ఇంటరాక్టివ్ త్రీడీ సాంకేతికతలు, డిజిటల్ ట్విన్ రోడ్ మ్యాప్ పై మరింత అవగాహన పెంచుకోవడానికి అన్ రియల్ ఇంజిన్ అధీకృత భాగస్వామిగా ప్రాప్ వీఆర్.. ఆ సంస్థ నిపుణులతో కలసి పని చేస్తుంది. ‘రియల్ ఎస్టేట్ పరిశ్రమ కోసం తదుపరి తరం త్రీడీ సొల్యూషన్స్, డిజిటల్ ట్విన్స్ ని రూపొందించడానికి అన్ రియల్ ఇంజిన్ టీమ్ తో భాగస్వామి అయినందుకు సంతోషిస్తున్నాం. అన్ రియల్ ఇంజిన్ గ్రాఫికల్ సత్తా సాటి లేనిది. మొత్తం నగరాల హై ఎండ్ త్రీడీ డిజిటల్ ట్విన్స్ ద్వారా రియల్ ఎస్టేట్ శోధన, ఆవిష్కరణ అనుభవాన్ని పెంపొందించడంలో ఆ సంస్థ సహాయం చేస్తుంది.
అన్ రియల్ ఇంజిన్ తో కలిసి మెటావర్స్ లో రియల్ ఎస్టేట్ ను నిర్మించడానికి మేం మరింత వేగవంతంగా పని చేస్తాం. అదే సమయంలో వర్చువల్ రియల్ ఎస్టేట్ అనుభవం ఎలా ఉండాలని వినియోగదారులు కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటాం’ అని స్క్వేర్ యార్డ్స్ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ వివేక్ అగర్వాల్ అన్నారు.
This website uses cookies.