Categories: CONSTRUCTION

నిర్మాణ కార్మికులు.. నొప్పులమయం

  • కీళ్లనొప్పులు, శ్వాస, నాడీసంబంధిత సమస్యలతో సతమతం

వారు లేకుంటే ఒక్క భవనం కూడా నిర్మాణం కాదు. వారు కట్టిన భవనాలు ఏళ్లపాటు ఎంతో పదిలంగా ఉంటాయి. అదే సమయంలో వారిని అనారోగ్య సమస్యలు కూడా అలాగే వెంటాడుతున్నాయి. వారే.. భవన నిర్మాణ కార్మికులు. వారిలో చాలామంది కీళ్లనొప్పులతోపాటు శ్వాస, నాడీసంబంధిత సమస్యలతో సతమతమవుతున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. 457 మందిపై అధ్యయనం నిర్వహించగా.. 44 శాతం మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నట్టు తేలింది. అలాగే మరో 38 శాతం మంది శ్వాస, నాడీసంబంధిత రుగ్మతలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. ‘అసంఘటిత రంగంలో పెద్దసంఖ్యలో పనిచేస్తున్నవారి ఆరోగ్య, మానసిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఈ అధ్యయనం నిర్వహించాం. మేస్త్రి రుత్విక్ పురానీల నుంచి ప్లంబర్ల వరకు భవన నిర్మాణంలోపాలుపంచుకునే పలువురిపై అధ్యయనం చేశాం. వీరిలో 28 శాతం మంది గుజరాత్ కు చెందినవారు కాగా, మిగిలినవారు ఇతర రాష్ట్రాలవారు’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన రుత్విక్ పురానీ రీసెర్చ్ గైడ్ డాక్టర్ నేహల్ షా తెలిపారు. వీరిలో ఎక్కువమంది 40 ఏళ్లలోపువారే ఉన్నారని తెలిపారు. నిర్మాణ కార్మికులు తరచుగా అనారోగ్యానికి గురికావడం వారి ఆయుష్షుపై ప్రభావం చూపిస్తోందని బంధకం మజూర్ సంఘటన్ జనరల్ సెక్రటరీ విపుల్ తెలిపారు. ఎక్కువమంది కీళ్ల నొప్పులతో బాధపడుతుండటం ఆందోళనకర విషయమని పేర్కొన్నారు.

అధ్యయనంలో వెల్లడైన విషయాలివీ..

అధ్యయనంలో పాల్గొన్నవారిలో దాదాపు 38 శాతం మంది నాలుగు కంటే ఎక్కువ రకాల కీళ్ల నొప్పులతో బాధపడుతుండగా.. 22 శాతం మంది మూడు రకాలు, 21 శాతం మంది రెండు రకాల నొప్పులతో సతమతమవుతున్నారు.
– ఎక్కువమందికి నడుము నొప్పి ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. దాదాపు 79 శాతం మంది నడుము నొప్పి ఉన్నట్టు చెప్పగా.. 70 శాతం మంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నట్టు వెల్లడించారు.
– చేస్తున్న పనిని బట్టి చేతులు, భుజాలు, కాళ్లనొప్పులతో సతమతమవుతున్నట్టు పలువురు తెలిపారు.
– నిర్మాణ కార్మికుల సగటు వయసు 23 ఏళ్లు. దీంతో చిన్నవయసులతో మానసికపరమైన సమస్యలను ఎదుర్కోవడం వల్ల వారి ఆయు ప్రమాణాలు కూడా తగ్గుతున్నాయి.
– మానసికపరమైన సమస్యలతోపాటు శ్వాస, నాడీసంబంధిత రుగ్మతలున్నట్టు 44 శాతం మంది వెల్లడించగా.. 32 శాతం మంది ఇందులో రెండు రకాల రుగ్మతలున్నట్టు పేర్కొన్నారు. 24 శాతం మంది తాము ఒకే సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పారు.
– రూ.18,616 కోట్లు రావొచ్చని నైట్ ఫ్రాంక్ అంచనా

వచ్చే ఏడాది మనదేశ రియాల్టీ రంగంలోకి భారీగా పెట్టుబడులు రానున్నాయని నైట్ ఫ్రాంక్ అనే పరిశోధన సంస్థ అంచనా వేసింది. 2022లో భారత రియాల్టీ రంగంలో సీమాంతర పెట్టుబడులు 250 కోట్ల డాలర్ల (దాదాపు రూ.18,616 కోట్లు)కు చేరుకుంటాయని పేర్కొంది. ‘ఇటీవల కాలంలో అమలు చేసిన నిర్మాణాత్మక సంస్కరణలు మనదేశ రియల్ రంగానికి ఎంతో ఊపునిచ్చాయి. ఇవన్నీ అంతర్జాతీయంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశ రియల్ రంగంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఏర్పడింది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. ఇక 2022లో రియల్ రంగంలో సీమాంతర పెట్టుబడులు పెట్టడానికి అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ సరైన దేశాలని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది.

This website uses cookies.